జిల్లా రెవిన్యూ అధికారి గా బాధ్యతలు స్వీకరించిన ఎం. శ్రీదేవి
1 min read
మర్యాదపూర్వకంగా కలిసిన ఏ.పి.రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె.రమేష్ కుమార్
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా నూతన రెవిన్యూ అధికారి గా బాధ్యతలు స్వీకరించిన ఎం. శ్రీదేవి ని ఏలూరు కలక్టరేట్ నందు ఏ.పి.రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ సంఘ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమములో కె. రమేష్ కుమార్,జిల్లా అధ్యక్షులు, ఏ.పి.రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్,ఏ.ప్రమోద్ కుమార్, జిల్లా కార్యదర్శి. ఏ పి ఆర్ ఎస్ ఏ ఏలూరు జిల్లా, కె. రవిచంద్ర, జిల్లా ఉపాధ్యక్షులు, కె. స్వామి, జిల్లా జాయింట్ సెక్రటరీ మరియు ఏలూరు డివిజన్ ప్రెసిడెంట్, జె. శ్రీను నాయక్, ఏలూరు కల్లెక్టరేట్ ప్రెసిడెంట్ తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు.


