నిప్పులు చెరిగిన సచిన్ కొడుకు
1 min readపల్లెవెలుగువెబ్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఎడమచేతివాటం పేస్ బౌలర్ అయిన అర్జున్ టెండూల్కర్ దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో నిప్పులు చెరిగే బౌలింగ్ ప్రదర్శన కనబర్చాడు. ముంబయి జట్టులో పోటీ తీవ్రంగా ఉండడంతో, ఈ సీజన్ లో అర్జున్ గోవా జట్టు తరఫున బరిలో దిగాడు. హైదరాబాద్ జట్టుతో జరిగిన లీగ్ మ్యాచ్ లో ఈ పొడగరి పేసర్ 4 ఓవర్లలో 10 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టడం విశేషం.