మైనార్టీలపై సీఎం కపట ప్రేమ…
1 min read– మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి
పల్లెవెలుగు , వెబ్ పాణ్యం : సోమవారం నాడు పాణ్యం మండలం కొనిదేడు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే పాణ్యం టిడిపి ఇన్చార్జి గౌరు చరితారెడ్డి బాడుడే – బాదుడు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున టిడిపి శ్రేణులు నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు మాజీ శాసనసభ్యురాలు గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకొని. వైసిపి పాలనలో పెరిగిన పన్నుల భారం నిత్యావసర సరుకుల ధరలు గురించి ప్రజలకు వివరించారు. ఇంటి పన్ను, చెత్త పన్ను, కరెంట్ ఛార్జీలు, ఆర్టీసి ఛార్జీలు పెంచడం వలన అనేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామా ప్రజలు, మాజీ ఎమ్మెల్యే చరితమ్మ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ పాలనలో కుడి చేత్తో పది రూపాయిలు ఇచ్చి ఎడమ చేత్తో వంద రూపాయిలు లాగేసుకుంటుందని వైసీపీ ప్రభుత్వం ప్రజలపై ఏ విధంగా కక్ష కట్టి ప్రజల నుండి రకరకాల పన్నుల రూపంలో దోపిడీ చేస్తున్నారో సవివరంగా వివరించారు. గత ఎన్నికల ముందు ఒక అవకాశం ఇవ్వండి అని ప్రజలను ప్రాధేయపడీ అధికారంలోకి వచ్చిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులను, ఉద్యోగస్తులను, విద్యార్థులను రైతులను అన్ని వర్గాలు కులాల వారిని ఇబ్బంది పెడుతూ పరిపాలన సాగిస్తున్నారని మాట తప్పం మడమ తిప్పను ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి గారు ముస్లిం మైనారిటీ ఆడపిల్లలకు దుల్హన్ పథకం క్రింద తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చే 50 వేల రూపాయలను లక్ష రూపాయలు ఇస్తానని వాగ్దానం చేసి పూర్తిగా ఆ పథకం ఎత్తివేశారని కంటి తుడుపు చర్యగా మళ్లీ షాది ముబారక్ అంటూ పదో తరగతి చదివిన వధూవరులకే పథకం వర్తిస్తుందని చెప్పడం మైనార్టీలకు మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు లక్ష రూపాయల దాకా గత ప్రభుత్వంలో ఇచ్చిన మైనార్టీ లోన్ల ఊసే లేదని ఆరోపించారు ఉపాధ్యాయులకు ఒక్క వారంలో సిపిఎస్ రద్దు చేస్తానాని వాగ్దానం చేసి మాట తప్పారని మడమ సైతం తిప్పారని ఏద్దేవా చేశారు. వైసిపి నాయకులు ఈ ప్రాంతంలో ఖాళీ భూమి కనబడిన వెంటనే కబ్జా బోర్డు పెట్టేస్తున్నారని ఆరోపించారు చోట మోటా నాయకులు కబ్జాదారుల గా మారి ప్రజలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు అని ప్రజలు ఇకనైనా కళ్ళు తెరచి వచ్చే ఎన్నికల్లో వైసీపీ నాయకులకు బుద్ది చెప్పి తెలుగుదేశం ప్రభుత్వంను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జయరామి రెడ్డి,గ్రామ నాయకులు రామ్ పుల్లా రెడ్డి,భరత్ రెడ్డి,తిరుపతి,రెడ్డి, తిరుపల్,మండల నాయకులు రమణ మూర్తి,గోవింద్ రెడ్డి,సునీల్ రెడ్డి,లాయర్ బాబు, బీటెక్ పుల్లారెడ్డి,శివ శంకర్ రెడ్డి,అమర సింహ రెడ్డి,ఎంపీటీసీలు భాస్కర్ రెడ్డి,రంగ రమేష్,గొరుకల్లు సురేష్,వెంకటేష్,చంద్ర రెడ్డి,హనుమంత్,సునీల్,కుమార్ రెడ్డి సుధాకర్,ఖాదర్, జిల్లా కార్యదర్శి కెతురు మదు,తెలుగు యువత నియోజకవర్గ ఆధ్యక్షుడు గంగాధర్ గౌడ్,వడుగండ్ల మోహన్ మరియు టీడీపీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.