PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెరుగుతున్న బోలు ఎముక‌ల స‌మ‌స్యలు..

1 min read

అంతర్జాతీయ బోలు ఎముకల దినోత్సవం అక్టోబర్ 20న
డాక్టర్. పి. కిర‌ణ్‌కుమార్‌
క‌న్సల్టెంట్ ట్రామా & జాయింట్ రీప్లేస్‌మెంట్ స‌ర్జన్‌
పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: కిమ్స్ హాస్పిట‌ల్, క‌ర్నూలు ఆస్టియోపోరోసిస్ అనేది ఎముకలకు వచ్చే వ్యాధి. దీన్ని బోలు ఎముకల వ్యాధి అంటారు. ఇది సోకిన వారిలో ఎముకలు బలహీనంగా, పెళుసుగా మారుతాయి. ఈ వ్యాధిపై అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం అక్టోబర్ 20న బోలు ఎముకల వ్యాధి దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ రోజున వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన తీసుకవస్తారు. సాధారణంగా ఇది 45 ఏళ్లు పైబడిన మహిళల్లో, మెనోపాజ్ దశకు చేరుకున్న వారిలో కనిపిస్తుంది. దీని వల్ల ఎముక విరిగిన ప్రదేశంలో కొత్త ఎముక వృద్ధి చెందదు. ఎందుకు సోకుతుందంటే.. బోలు ఎముకల వ్యాధి కొంతమంది మగవాళ్లకు కూడా సోకుతుంది. తగినంత సూర్యరశ్మిని అందనివారు, వ్యాయామం చేయని వ్యక్తులు దీని బారిన పడే అవకాశం ఉంది. మద్యపానం, పొగతాగే అలవాటు ఎక్కువగా ఉన్న వారికి ఆస్టియోపోరోసిస్ రావచ్చు. శరీరంలో కాల్షియం స్థాయులు తక్కువగా ఉన్నవారిలోనూ ఈ వ్యాధి కనిపిస్తుంది. కుటుంబంలో ఇంతకు ముందే ఎవరికైనా ఈ వ్యాధి సోకితే, జన్యుపరంగానూ ఇది వ్యాపించవచ్చు. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది జిమ్ చేయడం, ఏసీ జిమ్లు వాడుతున్నారు. పార్కులు లేదా సూర్యర్శి తాకే చోట వ్యాయాయం చేయడం చాల ఉత్తమం. దీని వల్ల శరీరానికి డి విటిమిన్ లభిస్తుంది. దీంతో ఎముకల బలంగా మారే అవకాశం ఉంటుంది.
లక్షణాలు: వెన్నునొప్పి, శరీరాకృతి వంగిపోవడం, ఎత్తు తగ్గుతున్నట్లు కనిపించడం, చిన్న ప్రమాదాలకే ఎముకలు విరిగిపోవడం వంటివి బోలు ఎముకల వ్యాధి సాధారణ లక్షణాలు. పెన్నుపూసలో పగుళ్లు ఏర్పడితే వెన్నెముక, తుంటి ప్రాంతంలో నొప్పి వస్తుంది. సరైన నివారణ చర్యలు తీసుకోకపోతే కొంత మంది మహిళల్లో ఇది మూపురంలా పెరుగుతుంది. తుంటి ఎముకలో ఏర్పడే పగుళ్లు (హిప్ ప్రాక్చర్) త్వరగా నయం కావు. పూర్తిగా కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది.
రోగ నిర్ధారణ:
ఎక్స్ -రే ద్వారా బోలు ఎముకల వ్యాధిని నిర్ధారించవచ్చు. తక్కువ లక్షణాలు ఉండే వారిలో ఎముకలు పెళుసుగా మారాయని తెలుసుకోలేరు. ఇలాంటి అతిచిన్న లక్షణాలను గుర్తించడానికి, సరైన చికిత్స అందించడానికి డిఇఎక్స్ఏ స్కాన్ (బోన్ డెన్సిటీ స్కాన్) సహాయపడుతుంది.
చికిత్స:
ఈ వ్యాధి బారిన పడిన వారు వైద్యుల సలహాతో మందులు వాడాలి. వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. మధ్యపానం, పొగ తాగడం మానేయాలి. ఎముకల దృఢత్వానికి విటమిన్ డి లభించే ఆహారం తీసుకోవాలి. కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి.

About Author