NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జీజీహెచ్ కు సిటీ స్కానింగ్ మిషన్ డొనేషన్

1 min read

దాతలను అభినందించిన సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు

కర్నూలు హాస్పిటల్, న్యూస్ నేడు : కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు అధునాతనమైన  సీమెన్స్ కంపెనీకి  సంబంధించిన సిటీ స్కానింగ్ మిషన్ ను పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ వారి సహకారంతో డొనేషన్ చేశారని ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ వారు మరియు హెచ్ఎల్ఎల్​ లైఫ్ కేర్ లిమిటెడ్ వారి సమక్షంలో మిషన్ ను  రాష్ట్ర ప్రభుత్వాసుపత్రికి అప్పగించడం జరిగింది.  ఈ సందర్భంగా సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు సిటి – సిటీ స్కానింగ్ మిషను రేడియాలజీ విభాగానికి అందజేస్తూ వారికి ఉత్తర్వులు జారీ చేశారు. ఆసుపత్రిలో – సిటీ స్కానింగ్ మిషన్ త్వరలో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.  మిషన్ వల్ల పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడానికి తోడ్పడుతుందని అన్నారు. అనంతరం డాక్టర్ రాధారాణి  మాట్లాడుతూ రేడియాలజీ విభాగానికి అధునాతనమైన యంత్రాలు మరియు సహాయ సహకారాలు అందిస్తున్న ఆసుపత్రి సూపరిండెంట్ గకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి రేడియాలజీ హెచ్ ఓ డి డా. రాధా రాణి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ డిప్యూటీ జనరల్ మేనేజర్ నాగరాజు, సీమెన్స్ కంపెనీ ప్రాజెక్టు మేనేజర్, రవి వర్మ,  సేల్స్ మేనేజర్, దీప్తి, హెచ్​ఎల్​ఎల్​ లైఫ్ కేర్ లిమిటెడ్ డిప్యూటీ బయో మెడికల్ మేనేజర్, మీనా తదితరులు పాల్గొన్నారు.

About Author