NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రోత్సాహకాలు మరింత బాధ్యతను పెంచుతాయి…

1 min read

అబ్దుల్ లతీఫ్, యూటీఎఫ్ సీనియర్ నాయకులు

ప్యాపిలి, న్యూస్​ నేడు: ప్యాపలి పట్టణంలోని జూనియర్ కళాశాలలో శుక్రవారం మధ్యాహ్నం కళాశాల ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం అధ్యక్షతన జరిగిన అభినందన సభలో యూటీఎఫ్ సీనియర్ నాయకులు అబ్దుల్ లతీఫ్ మాట్లాడుతూ సన్మానాలు ప్రోత్సాహకాలు బాధ్యతను మరింత పెంచుతాయని.రమ్య 470 కి 462 మార్కులు తీసుకుని రావడం సామాన్యమైన విషయం కాదని అందుకు కృషి చేసిన ప్రిన్సిపాల్ కి అధ్యాపక బృందానికి కృతఙ్ఞతలు తెలియచేశారు. ముఖ్యంగా అమ్మాయి రమ్య కి అద్భుతమైన భవిష్యత్ ఉందని ఈ సన్మానం మరింత బాగా చదివి ద్వితీయ సంవత్సరం లో 1000 కి 980 పై చిలుకు మార్కులు సాధించాలని తపన కలిగేలా చేస్తుందని..ఇటువంటి ప్రోత్సాహక కార్యక్రమాలు చేయడానికి యూటీఎఫ్ ఎప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా ఆయన తెలియచేశారు…అదేవిధంగా ఈ అద్భుత ఫలితానికి కారణమైన ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం కి యూటీఎఫ్ మండల శాఖ తరఫున సత్కరించారు .కార్యక్రమంలో యూటీఎఫ్ ప్యాపలి మండల అధ్యక్షులు రమేష్ నాయుడు,అమీర్ బాషా,సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author