సోము వీర్రాజు పై కన్నా ఫైర్
1 min read

పల్లెవెలుగువెబ్ : బీజేపీ ఏపీ శాఖలో తొలిసారి అసమ్మతి స్వరం వినిపించింది. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజుపై మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని నడిపే విషయంలో రాష్ట్ర నాయకత్వం పూర్తిగా విఫలమైందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తమతో పొత్తులో ఉన్న జనసేనతో సమన్వయం చేసుకోవడంలోనూ రాష్ట్ర నాయకత్వం విఫలమైందని ఆయన అన్నారు. ఈ భావన ఇప్పటిదాకా తన మనసులోనే ఉన్నదని, ఇప్పుడది బయటకు వచ్చిందని ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై పార్టీ అధినాయకత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కూడా కన్నా వ్యాఖ్యానించారు.

