గ్రామాల్లో సోషల్ ఆడిట్
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: రేపటి(సోమవారం) నుంచి ఈనెల 31వ తేదీ వరకు మిడుతూరు మండలంలోని వివిధ గ్రామాలలో సోషల్ ఆడిట్ జరుగుతుందని ఏపీఓ భూపన జయంతి తెలిపారు.జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకమునకు సంబంధించిన 15వ రౌండ్ సోషల్ ఆడిట్ టీం శనివారం రోజున వారు మండలానికి రావడం జరిగినది.వివిధ శాఖలకు సంబంధించిన పంచాయతీ రాజ్,ఆర్డబ్ల్యూఎస్,పశుసంవర్ధక శాఖ, ఉపాధి హామీ పథకం రికార్డులను వారికి అప్పజెప్పారు. టీం సభ్యులు రేపటి నుంచి వివిధ గ్రామాలలో సోషల్ ఆడిట్ నిర్వహించి గ్రామసభ నిర్వహిస్తారు.తర్వాత ఈనెల 31వ తేదీన మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో మండల స్థాయి బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని ఏపీవో తెలియజేశారు.తదనంతరం ఎంపీడీఓ జిఎన్ఎస్ రెడ్డి అధ్యక్షతన కోఆర్డినేషన్ సమావేశం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా రిసోర్స్ పర్సన్లు,ఏపీఓలు భూపన జయంతి,వలి బేగ్,ఈసీ నరేష్,టెక్నికల్ అసిస్టెంట్లు,ఫీల్డ్ అసిస్టెంట్లు మరియు తదితరులు పాల్గొన్నారు.