ఆదానీ అక్రమ వ్యాపారాలపై సిబిఐ విచారణ జరపాలి..
1 min read– జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి సమగ్ర విచారణ జరపాలి.
– సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి..
– కాంగ్రెస్ నంద్యాల పార్లమెంట్ జిల్లా డీసీసీ అధ్యక్షులు జ.లక్ష్మి నరసింహ యాదవ్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సోమవారం నంద్యాల చెక్పోస్ట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ నంద్యాల పార్లమెంటు జిల్లా డిసిసి అధ్యక్షులు జ.లక్ష్మి నరసింహ యాదవ్ మాట్లాడుతూ గత ఎనిమిదిన్నర సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్వీర్యం చేయడమే పనిగా పెట్టుకుందని ధ్వజమెత్తారు. ఎల్‌ఐసి, ఎస్‌బిఐలకు నష్టం చేకూరేలా వాటి ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టిన ఆదానీ సంస్థపై వచ్చిన ఆర్థిక ఆరోపణలపై విచారణ చేయకుండా ఇంకా వారికి కొమ్ముకాయ డందారుణమన్నారు. మాట్లాడుతూ ఎఐసిసి మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గతంలోనే పెద్దఎత్తున మనీ లాండరింగ్ జరుగుతోందని దీని వల్ల దేశానికి తీవ్రమైన ఆర్థిక నష్టం జరుగుతుందని హెచ్చరిస్తూ వస్తున్నారన్నారు. హిడెన్‌బర్గ్ నివేదిక అన్ని విషయాలను బహిర్గతం చేసిందని, కేంద్ర ప్రభుత్వం అంబానీ, ఆదానీలను దేశ సంపదను దోచిపెడుతోందని ఆరోపించారు. ఎల్‌ఐసి, ఎస్‌బిఐ బ్యాంకుల్లో పేద, మధ్య తరగతి ప్రజలు దాచుకున్న సొమ్మును అక్రమంగా మళ్లించడం వల్ల చాలా కుటుంబాలకు తీరని నష్టం జరుగుతుందన్నారు. ఆదానీ గ్రూప్ అక్రమ వ్యాపారాలపై సిబిఐతో పాటు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేసారు. ఎల్‌ఐసిలో 18 వేల కోట్లు, ఎస్‌బిఐకి 45 వేల కోట్లు ఆదానీ గ్రూప్ సంస్థల వల్ల నష్టం వచ్చే అవకాశం ఉందన్నారు. ఇంకా చాలా బ్యాంకులు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాయని, ఈ వ్యవహారం దేశానికి చాలా ప్రమాదకరంగా పరిణమిస్తుందన్నారు. ప్రజల ఆస్తులను కొల్లగొడుతున్న ఆదానీ గ్రూప్‌పై విచారణ జరిపించడంతో పాటు ప్రజలకు నష్టం జరగడకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఆదానీ సంస్థల ఆర్థిక కార్యకలాపాలపై విచారణ జరిపి వాస్తవాలు బయటపెట్టే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదన్నారు. . సిబిఐతో పాటు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు బాలస్వామి గారు మైనార్టీ సెల్ చైర్మన్ పఠాన్ అభి ఖాన్ గారు వెంకట్ నాయుడు ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.