ఏ.పి సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాప్ కౌన్సిల్ ను సమావేశపరచండి
1 min read– ఆపస్ వినతి
పల్లెవెలుగు వెబ్ విజయవాడ: ఉద్యోగ ఉపాధ్యాయ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దీని కనుగుణంగా నాలుగు సంఘాలతోనే కాకుండా జాయింట్ స్టాప్ కౌన్సిల్ లోని అన్ని సంఘాలతో సమావేశాలను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు సిహెచ్ శ్రావణ్ కుమార్ ఎస్ బాలాజీలు డిమాండ్ చేశారు. పిఎఫ్ ఏపీ జి ఎల్ ఐ బకాయిలు సత్వరం చెల్లించాలని పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం కృషి చేయాలని ఈనెల 7న జరగనున్న సమావేశంలో జాయింట్ స్టాప్ కౌన్సిల్లో సభ్యసంఘాలన్నిటిని పిలవాలని వారు కోరారు.