PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు తీర్చాలి : శీలం శేషు

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: ఆత్మకూరు ఎంపీడీవో ఆఫీస్ నందు సోమవారం ఉదయం 11 గంటలకు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రజా సంఘాలు హాజరయ్యారు ఈ సందర్భంగా శీలం శేషు మాట్లాడుతూ మండలంలోని పారిశుద్ధ కార్మికులు చాలీచాలని జీతంతో పల్లెల్లో పని చేస్తున్నారు గత నెల ప్రభుత్వ అధికారులకు పది రోజులు లేటుగా జీతాలు వస్తే రాష్ట్రమంతా అల్ల కొలం చేశారు పారిశుద్ధ కార్మికుల జీతాల కోసం, కరెంటు బిల్లుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు నిధులు ఇస్తే కొంతమంది అధికారులు వీరికి జీతాలు ఇవ్వకుండా కమిషన్ కోసం లేదా ఆ గ్రామ నాయకుల మెప్పుకోసం కాంట్రాక్టర్స్ కి బిల్లులు చేసి ఇచ్చారు నెలకు జీతం 6000 రూపాయలకు పని చేస్తున్న వీరికి 9 నెలలుగా జీతం రాకుంటే వీరి యొక్క ఇంటి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో అధికారులు ఆలోచించాలే కానీ కక్ష సాధింపులు ఉండకూడదు ట్రక్కు డ్రైవర్లకు కూడా జీతాలు ఇవ్వాలి వీరి యొక్క సమస్యలను సత్వరం పరిష్కరించాలని రాయలసీమ పారిశుద్ధ కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షులు శీలం శేషు అన్నారు నంద్యాల డివిజన్ దళిత సంఘం యువ నాయకుడు రాజేష్ మాట్లాడుతూ ఆయా గ్రామాలలో ఎట్టి పని అనగా చెత్త చెదారం తో పాటు మలమూత్రాలను సైతం ఈ పారిశుద్ధ కార్మికులు ఎత్తివేస్తున్నారు మనసు చంపుకొని కుటుంబం అవసరాలకోసం ఊరు వెంబడి చెత్తాచెదారం మురుగు కాలువల క్లీనింగ్ రోడ్డు వెంబడి పశువుల పేడ ఎత్తివేయడం కేవలం మా జాతి బిడ్డలు మాత్రమే చేస్తున్నారు వీరి యొక్క యోగ క్షేమాలు చూసుకోవాల్సిన అధికారులు ఇది మరచి మిమ్మల్ని ఉద్యోగాలనుంచి తీసివేస్తామంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు కొంతమంది అధికారుల పనితీరును ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకువెళ్తామ్ పారిశుద్ధ కార్మికులు ఉదయం 10 గంటల వరకు మాత్రమే పని చేయాలే తప్పగాసగాళ్ల మాదిరి పనిచేయించకూడదని అన్నారు పారిశుద్ధ కార్మికుల సంఘం అధ్యక్షుడు స్వామి దాసు మాట్లాడుతూ మండలంలో పనిచేస్తున్న 48 మందికి యూనిఫామ్,చేతులకుగ్లావ్ జులు ఇవ్వాలని కోరారు అనంతరం ఎండిఓ ఆఫీస్ నందు కళ్యాణ్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు శేఖర్ సుధాకర్, వెంకటరాముడు రత్నమయ్య,శివ, నాగేశ్వరరావు రాముడు,రాజశేఖర్, సుందర్ రావు రవితేజ, రత్నస్వామి ప్రసాద్ బాబు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

About Author