PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కౌతాళం మండల తహశీల్దారుకి వినతి : మండల విలేకరులు

1 min read

పల్లెవెలుగు వెబ్ కౌతాళం: కౌతాళం పల్లెవెలుగు మార్చ్ 6 కౌతాళం మండల కేంద్రంమైన ఎంపీడీవో ఆఫీస్ పక్కన ఉన్న 330/1 సర్వే నంబరు లో 0.13 సెంట్ల స్థలము గురించి కౌతాళం మండల కేంద్రము నందు 330/1 నందు గల 0.13 సెంట్ల ప్రభుత్వ స్థలమును కొంత మంది ప్రతికా విలేకరుల, రాజకీయ నాయకులు గతంలో పట్టాలు సృష్టించుకోని చాలా సంవత్సరాల తర్వాత స్వాధీన పరుచుకొనటకు, సిద్ధమయ్యారు . ఇది వరకే అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది . కబ్జాదారులు ప్రయత్నం ఆపడం లేదు . కావున కౌతాళంలో సంత మార్కెటు , గ్రంథాలయం , రెవెన్యూ భవన్, ఇలా ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించి స్వాధీన పరచుకోని వారు చేసుకున్న పట్టాలను రద్దు చేయాలని స్థానిక , మండల విలేకర్లు కోరడమైనది . ప్రస్తుతం నివసిస్తున్న దుఖానాదారులకు పంచాయితీ కార్యాలయం నుండి పన్ను వసులు చేసి ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చే విదంగా చర్యలు తీసుకోవాలని ఈ స్థలం గ్రామ నడిబోడ్డున ఉన్నందున పంచాయితకు లక్షలలో ఆదాయం వస్తుందని కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని విన్నవించుకుంటున్నాము . కొంత మంది ప్రైవేటు వ్యక్తులు ఈ స్థలాన్ని లీజుకు తీసుకోని లక్షలలో ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చి ఆలోచనలో ఉన్నారు . ఇలాంటి విలువైన స్థలాన్ని స్వార్థపనులకు కాకుండా దాదాపు 40 నుండి 50 కుటుంబాలకు జీవనోపాధి కల్పించాలని కౌతాళం మండలం తాసిల్దార్ కి విలేకరులు తెలపడం జరిగింది.

About Author