మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమంలో జడ్పిటిసి
1 min read

– ఆర్ బీ చంద్రశేఖర్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ గడివేముల: ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించి ఘనత జగన్ అన్నదేనని గడివేముల జడ్పిటిసి ఆర్ బీ చంద్రశేఖర్ రెడ్డి. పేర్కొన్నారు.శనివారం గడివేముల మండల కేంద్రంలో మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జడ్పిటిసి ఉపసర్పంచ్ బాలచెన్ని హాజరయ్యారు. జడ్పిటిసి ఆర్.బి మాట్లాడుతూ రాష్ట్రంలోరాజకీయాలకతీతంగా కుల మతాలకతీతంగా ప్రతి కుటుంబానికిప్రభుత్వం తరఫున లబ్ధి చేకూర్చాలన్న లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిఉన్నారన్నారు.ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి రాబోవు 2024 ఎన్నికలలో కూడావైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించి జగనన్నను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మనదేనన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్లు గృహ సారధులు నబి రసూల్ వైఎస్ఆర్సిపి కార్యకర్తల నాయకులు తదితరుల పాల్గొన్నాడు.

