పేదల ఆకలి తీర్చడమే లక్ష్యం
1 min readపల్లెవెలుగు వెబ్, రాయచోటి: కరోనా కష్టకాలంలో పేదలకు ఆకలి తీర్చడమే లక్ష్యమని హెల్పింగ్ హ్యాండ్స్ చైర్మన్ సయ్యద్ మైనుద్దీన్ తెలిపారు. శనివారం సుగవాసి ప్రసాద్ సహకారంతో పట్టణంలోని యాచకులకు, నిరాశ్రయులకు, బస్టాండ్ సర్కిల్లో అనాథలకు , కరోన బాధిత కుటుంబీకులకు ఆహార పొట్లాలు, వాటర్ ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా మైనుద్దీన్ మాట్లాడుతూ రెండు వారాలుగా అన్నదానం చేస్తున్నామని, అనాథలు, నిరాశ్రయులు, పేదలు ఎక్కడైనా ఆకలితో ఆలమటిస్తుంటే తమ దృష్టికి తీసుకురావలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో హెల్పింగ్ హాండ్స్ సంస్థ సభ్యులు అబూ రియాజ్,రిహాన్, ఆసిఫ్,జబి ఉల్లా తదితరులు పాల్గొన్నారు.