PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అర్హులైన ప్రతి పేద వానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు

1 min read

– నందవరం గ్రామం లో గడప గడప కు మన ప్రభుత్వం లక్ష్యం
– 2వ రోజు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : మండలం నందవరం గ్రామంలో గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బనగానపల్లె నియోజకవర్గ శాసన సభ్యులు కాటసాని రామిరెడ్డి నిర్వహించారు.గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించి ఇంటింటికి వెళ్లి జగనన్న అందిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ అర్హులైన వారు ఎవరైనా వుంటే వారికి ఎవరికైనా పథకాలు రాకుంటే అలాంటి వాటికి పరిష్కరించాలంటూ సచివాలయం ఉద్యోగులను ఎమ్మెల్యే కాటసాని ఆదేశించారు.ఈ సందర్భంగా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమానికి గ్రామాల్లో,పట్టణాల్లో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది అని ఎక్కడికి వెళ్ళిన కూడా ప్రజలు సతోషం వ్యక్తం చేస్తున్నారు అని ఇంక కొంత మందికి ఎక్కడైనా సాంకేతిక కారణాల వల్ల రాలేని వారికి వాటిని పరిష్కరించడం జరుగుతుంది అని చెప్పారు.పాదయాత్రలో ఇచ్చిన హామీల్లోఇప్పటికే 99 శాతం మేర నెరవేర్చిన ఘనత మన ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుంది అని చెప్పారు.నిత్యం ప్రజల కోసం కష్టపడే నాయకుడు మన ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అలాంటి నాయకున్ని మళ్ళీ మనం ముఖ్య మంత్రిగా చేసుకుంటేనే మనమందరం సంతోషం గా పార్టీ లకు,కులాలకు,మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేద వానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి పొందడం జరుగుతుంది అని కాబట్టి ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా వైయస్సార్ పార్టీ అఖండ మెజార్టీ తో గెలిపించాలని పిలుపు నిచ్చారు ఈ కార్యక్రమం లోMPDOశివ రామయ్య,శ్రీచౌడేశ్వరి దేవి ఆలయ మాజీ చైర్మన్ పిఆర్ వెంకటేశ్వర్ రెడ్డి,PL.తులసి రెడ్డి,పిఆర్ మురళి రెడ్డిAV చెన్నారెడ్డి,పాణ్యం దశరథ రామిరెడ్డి,పిఆర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి,సర్పంచ్ దూదేకుల ఖైరున్ బీ,దూదేకుల నాగరాజు,ఎంపీటీసీ సుధాకర్ రెడ్డి,గ్రామ వైయస్సార్ పార్టీ కన్వీనర్ శేఖర్ గౌడ్,పిఆర్ చిన్న ఓబుల్ రెడ్డి, సన్నల రమేష్ రెడ్డి,ఆర్. శేషిరెడ్డి, వైయస్సార్ పార్టీ ఐటీ వింగ్ జాయింట్ సెక్రెటరీ గణేష్ యాదవ్,బిసి సంఘం వైయస్సార్ పార్టీ నాయకులు వడ్డే తిరుపాల్,వడ్డేవెంకటరమణ, వడ్డేసుబ్రమణ్యం,వడ్డేనల్లన్నవడ్డేశివ, హేమంత్,గుండ్ల శింగవరం మహబూబ్బాషా,ఆదాంబాషా,బద్రి,మారుతి,లోకేష్ రెడ్డి ,జిత్తూ,సిద్దు,SC కన్వీనర్ బాలయ్య శిఖామణి, చౌడయ్య,హుస్సేన్ బాషా,మహబూబ్ బాషా,వైయస్సార్ పార్టీ నాయకులు,కార్యకర్తలు ,మండల అధికారులు,గ్రామ సచివాలయం సిబ్బంది,గ్రామ వాలంటీర్లు,గృహ తదితరులు పాల్గొన్నారు.

About Author