PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జనం మెచ్చిన జగనన్న పాలన..

1 min read

–సంక్షేమాభివృద్ధిలో  సీఎం జగన్ సరికొత్త అడుగులు.

–తొంభై తొమ్మిది శాతం హామీల అమలుతో  ప్రతి ఇంటా రెపరెప లాడుతున్న సంక్షేమ బావుటా.

–పండుగ వాతావరణంలో..ఆత్మీయ స్వాగతాల మధ్య  బ్రాహ్మణ కొట్కూరు  లో  గడప గడప కు మన ప్రభుత్వం.

–నందికొట్కూరు మండలం బ్రాహ్మణ కొట్కూరు గ్రామంలో నిర్వహించిన గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎంఎల్ఏ ఆర్థర్.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: సంక్షేమాభివృద్ధిలో సీఎం జగన్ సరికొత్త ఆడుగులు వేస్తున్నారని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ పేర్కొన్నారు.మంగళవారం నందికొట్కూరు మండలం బ్రాహ్మణ కొట్కూరు  గ్రామం సచివాలయం ఒకటి పరిధిలో నిర్వహించిన గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో  ఎమ్మెల్యే ఆర్థర్ పాల్గొన్నారు. ఇంటింటా తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలును వివరిస్తూ, సమస్యలపై ఆరా తీస్తూ  కార్యక్రమాన్ని కొనసాగించారు.ఈ సందర్భంగా ఆర్థర్  మాట్లాడుతూ ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ ఇచ్చిన హామీలను తొంభై తొమ్మిది శాతానికి పైగా  అమలుచేయడంతో ప్రతి ఇంటా  సంక్షేమ బావుటా  ఎగురుతోందన్నారు. సంక్షేమాభివృద్ధిలో సీఎం జగన్ సరికొత్త అడుగులు వేస్తున్నారన్నారు.

 సీఎం జగనన్న చేస్తున్న మేలు మరువలేమన్నా .

 గడప గడపనా ఆత్మీయ స్వాగతాలు.

ఇంటింటికీ రెండూ లేక మూడు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇన్ని సంక్షేమ పథకాలను అందిస్తున్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వమేనని, ఏ ప్రభుత్వంలోనూ ఇన్ని సంక్షేమ పథకాలును చూడలేదంటూ ఇంటింటా ఎమ్మెల్యే ఆర్థర్ కు ప్రజలు తెలుపుతున్నారు. ఏనోట విన్నా సీఎం జగనన్న మేలు మరువలేమంటూ  మహిళలు ,ప్రజలు పేర్కొంటుండడం విశేషం.పండుగ వాతావరణంలో  గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగింది. ఎమ్మెల్యే ఆర్థర్ కు  గడప గడపనా ఆత్మీయ స్వాగతాలు, కర్పూర హారతులతో ప్రజలు  స్వాగతం పలికారు.ముస్లింల సంక్షేమానికి జగన్ ప్రభుత్వం కృషి చేస్తోందంటూ  మైనారిటీలు ఎంఎల్ఏ కి తెలిపారు.నాడు స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మైనారిటీలుకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారని, నేడు సీఎం జగన్  మైనారిటీల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని, ఉర్దూను రెండో అధికార భాషగా గుర్తించారని, ప్రభుత్వ, నామినేటెడ్ పదవుల్లో ఊహించనివిధంగా మైనారిటీలుకు అగ్రతాంబూలం ఇచ్చారని,సబ్ ప్లాన్ ఏర్పాటు,మౌజం, ఇమామ్ సంక్షేమానికి  జగన్ ప్రభుత్వం కృషి చేస్తోందంటూ ఎంఎల్ఏ ఆర్థర్ ఎదుట మైనారిటీలు హర్షం వ్యక్తం చేశారు.

అక్క చెల్లెమ్మలకు అండగా వైఎస్ఆర్ ఆసరా.

ఇంటింటా ఆనందం వ్యక్తం చేసిన  మహిళలు.

 అక్క చెల్లెమ్మలకు అండగా వైఎస్ఆర్ ఆసరా నిలిచిందంటూ ఎంఎల్ఏ ఎదుట డ్వాక్రా మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎంఎల్ఏ ఆర్థర్ తో మహిళలు  మాట్లాడుతూ  గత ప్రభుత్వాలు మహిళా సంఘాలను  భారీ సమావేశాలకు తరలించుకున్నారే తప్ప వారికి లబ్దిచేకూర్చిందిలేదన్నారు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలును లక్షాధికారులుగా చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు.సమాజ పరిస్థితులకనుగుణంగా మహిళల్లో మార్పు రావాలని, మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు జగనన్న ప్రభుత్వం మల్టీ నేషనల్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని వారికి శిక్షణ ఇచ్చి వ్యాపార రంగాలలో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టిందనిజ  మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిందంటూ ఎంఎల్ఏ ఎదుట మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో  బ్రాహ్మణకొట్కూరు యువ నాయకులు  ఉదయ కిరణ్ రెడ్డి , మాజీ సింగిల్ విండో చైర్మన్  మద్దూరు హరి సర్వోత్తమ్ రెడ్డి , రఘు రెడ్డి , శ్రీనివాసులు , వైసీపీ జిల్లా కార్యదర్శి డా. వనజ,  వైసీపీ జిల్లా కమిటీ సభ్యులు పైపాలెం ఇనాయతుల్లా, దామగట్ల రత్నం, కోళ్ల బావాపురం వెంకటేశ్వర్లు, కోనేటమ్మపల్లి బోరెల్లి రఘు, బోరెల్లి తిరుపాలు, నందికొట్కూరు మాజీ సింగిల్ విండో చైర్మన్  సగినేల ఉసేనయ్య, సుజిత్ కుమార్ రెడ్డి, బిజినవేముల మహేష్, శాతనకోట వెంకటేశ్వర్లు, మండల ఇంచార్జ్ తహసిల్దార్  పుల్లయ్య యాదవ్ , మండల అభివృద్ధి అధికారి  శోభారాణి , ఐసీడీస్ సూపర్ వైజర్ అనురాధ, ఏపీఓ అలివేలమ్మ, డిప్యూటీ తహశీల్దార్ సత్యనారాయణ, విద్యాకమిటి చైర్మన్ పుల్లన్న, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, వైసిపి నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author