PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సచివాలయాలతోనే సాధ్యం

1 min read

– ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు:  గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం సచివాలయాలతోని సాధ్యమని ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు, శుక్రవారం సాయంత్రం మండలంలోని ఉప్పరపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని ఆయన ప్రారంభించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ సచివాలయ వ్యవస్థ తో ప్రజల వద్దకే పాలనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం జరిగిందన్నారు, దీని ద్వారా యువతకు లక్షలాది ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా, గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం తద్వారా గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సంక్షేమ పథకాలు అందించడంతోపాటు, వారికి అవసరమైన సర్టిఫికెట్లను అందించడం జరుగుతుందన్నారు, గతంలో జన్మభూమి కమిటీల ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు అందదేవని, నేడు అలాంటి ఇవన్నీ లేకుండా చేసి సంక్షేమ పథకాలు అర్హుడైతే చాలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుందన్నారు, ఇందులో కులం కానీ మతం కానీ పార్టీలు గాని చూడడం లేదని ఆయన అన్నారు, రాష్ట్రంలో 2 వేల జనాభాకు ఒక సచివాలయం, వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రం, డిజిటల్ లైబ్రరీలు, పాల కేంద్రాలు, వంటి వాటిని తీసుకురావడం తో పాటు, అక్కడి గ్రామ ప్రజలు పనులు మానుకొని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా సాగిస్తున్నదని ఆయన అన్నారు, ఇంతటి బృహతరమైన కార్యక్రమాలు చేపట్టడం ద్వారానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల మనసులో స్థిర స్థానం సంపాదించుకున్నారని ఆయన తెలిపారు, గత ప్రభుత్వంలో ప్రజలకు కీడు చేయడమే తప్ప మేలు చేయలేదని తెలిపారు, చంద్రబాబు కల్లబొల్లి మాటలే తప్ప హామీలు నెరవేర్చేది ఏమి ఉండదని, ప్రజలు ఎవరు నమ్మరని ఆయన పేర్కొన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతానే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నేరుగా ప్రజలకు వారి ఖాతాలలోకి డబ్బులు వేయడం జరుగుతుందన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ఆ గ్రామంలోనే గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించుకునేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను నియమించి ప్రజలకు అందుబాటులో ఉంచారు అన్నారు. ఒక్కొక్క కుటుంబానికి 70 వేల నుండి 5 లక్షల వరకు లబ్ధి చేకూరిందని ఆయన తెలిపారు, …..ఉప్పరపల్లి గ్రామంలో గ్రామ సచివాలయం, వైయస్సార్ హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలకు తన తల్లి పేరుపైన స్థలాన్ని కొనుగోలు చేసి గ్రామ ప్రజలకు అంకితం చేసిన గుమ్మా రాజేంద్రప్రసాద్ రెడ్డిని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అభినందించడం తోపాటు గ్రామ ప్రజలు, సంతోషం వ్యక్తం చేసి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి గుమ్మా రాజేంద్రప్రసాద్ రెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, మండల కన్వీనర్ జి ఎన్ భాస్కర్ రెడ్డి రాష్ట్ర అటవీ శాఖ డైరెక్టర్ రామన శ్రీలక్ష్మి,, సీనియర్ నాయకులు ఎర్ర సాని గోపాల్ రెడ్డి, ముదిరెడ్డి సుబ్బారెడ్డి, ఎంపీటీసీ నిరంజన్ రెడ్డి, కొండారెడ్డి, ఓబుల్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ సంపూర్ణం రెడ్డి, కో ఆప్షన్ నెంబర్ వారిష్, సర్పంచులు సుదర్శన్ రెడ్డి , తుంగ చంద్ర శేఖర్ యాదవ్, నాయకులు చల్లా వెంకటసుబ్బారెడ్డి బీసీ యువ నాయకులు నిత్య పూజయ్య, మాజీ ఎంపీటీసీ నరసయ్య, పండు బాయ్ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author