PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘వ్యాయామం’తో.. స్ర్టోక్​ కు చెక్​…!

1 min read

బ్రెయిన్​, హార్ట్​ స్ర్టోక్​ …ఏదైనా ..!

  • డాక్టర్​ హేమంత్​, న్యూరో స్పెషలిస్ట్​, కర్నూలు
  • అక్టోబరు 29న ప్రపంచ స్ర్టోక్​ డే

పల్లెవెలుగు, కర్నూలు: మనిషి గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా….మెదడు విధులు సరిగా చేయాలన్నా…. రక్తనాళాల ద్వారా ఆక్సిజన్​ సరిపడేంత అందాలి. అందుకు రక్తప్రసరణ సక్రమంగా ఉండాలి.  మెదడుకు… గుండెకు ఆక్సిజన్​ అందకపోతే… స్ర్టోక్​ వచ్చే ప్రమాదం ఉంటుందన్నారు కర్నూలు హార్ట్​ అండ్​ బ్రెయిన్​ మల్టీ సూపర్​ స్పెషాలిటి హాస్పిటల్​  న్యూరో స్పెషలిస్ట్​ డాక్టర్​ హేమంత్​ కుమార్​.  అక్టోబరు 29న ప్రపంచ స్ర్టోక్​ డే గా నిర్వహిస్తారు. అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ 2004 నుంచి ప్రతి  సంవత్సరం ఒక థీమ్​గా ఒక ముఖ్య అంశాన్ని ప్రకటిస్తుంది.   ఈ ఏడాది స్ర్టోక్​ల నివారణ మరియు చికిత్సపై అవగాహన పెంచడానికి  ఈ ఏడాది అక్టోబరు 29న పాటిస్తారు.

బ్రెయిన్​ స్ర్టోక్​తో…40 సెకన్లకు ఒకరు మృతి..:

ప్రపంచ వ్యాప్తంగా బ్రెయిన్ స్ట్రోక్ మరణానికి రెండవ ప్రధాన కారణం మరియు వైకాల్యానికి మూడవ  ప్రధాన కారణం.  భారతదేశంలో బ్రెయిన్ స్ట్రోక్ బాధితులు సంఖ్య ఎక్కువ అని పరిశోధకులు చెబుతున్నారు.  ప్రతి ఏడాది సగటున 1,85,000 మంది ఈ పక్షవాతం లేదా బ్రెయిన్ స్ట్రోక్ కు గురువుతున్నారు.   ప్రతి 40 సెకన్లకు ఒకరు ఈ వ్యాధి బారిన పడుతున్నారు మరియు ప్రతి 4 నిమిషాలకు ఒకరు ఈ వ్యాధి తో మృతి చెందుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

స్ర్టోక్​పై… అవగాహన..:

ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే బ్రెయిన్​ స్ట్రోక్​ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి… ఇందుకు అవగాహన లేకపోవడమే ప్రధాన కారణం. బ్రెయిన్ స్ట్రోక్ అంటే మొదడులోని ఒక భాగానికి రక్తప్రసరణ ఆగిపోవడం. ఇలా రక్తప్రసరణ ఆగిన ప్రతి నిమిషానికి 20 లక్షల న్యూరాన్లు (కణాలు) చనిపోవడం జరుగుతుంది. ఎంత ఆలస్యం అయితే అంత ప్రభావం ఎక్కువగా ఉంటుంది.  స్ర్టోక్​ను త్వరగా గుర్తించాలి. వ్యాధి ప్రారంభంలోనే అరికట్టడానికి పూర్తి జాగ్రత్తలు తీసుకుంటే .. ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది.

బ్రెయిన్ స్ట్రోక్​కు…సంకేతాలు:

బి-బ్యాలెన్స్ సమస్యలు (తూలడం)

ఈ – చూపు మందగించడం, రెండుగా కనబడడం

ఎఫ్ – ముఖం వంగిపోవడం

ఎస్- అస్పష్టమైన మాటతీరు

టి – సమయం చాలా మఖ్యమైనది

వైద్య సదుపాయాలు:

థ్రాంబోలైసిస్ అనగా గడ్డ కట్టిన రక్తనాళానికి ఇంజెక్షన్ ద్వారా కరిగించే ప్రయత్నం చేయడం. దాని ద్వారా బ్రెయిన్ లోని ఏ ప్రాంతానికైతే రక్తప్రసరణ ఆగిపోయిందో దానికి పునరావృతం చేయడం జరుగుతుంది. దీని వలన వైకల్యానికి నిర్మూలించవచ్చు.

–        ఈ చికిత్స రోగికి మొదట సంకేతం ప్రారంభమైన 4 గంటల 30 నిమిషాలలో మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది.

–        కాబట్టి న్యూరాలజి విభాగం మరియు అన్ని సదుపాయాలు గల ఐసియు ఉన్న హాస్పిటల్ కి స్ట్రోక్ వచ్చిన 4 గంటల లోపు రోగిని తీసుకవెళ్లడం కీలకం.

–        మొదటి సంకేతం లేదా బలహీనత  వచ్చిన గంటలోపు థ్రాంబోలైసిస్ చేసిన వ్యక్తి, 4 గంటలలోపు థ్రాంబోలైసిస్ చేసిన వ్యక్తి కంటే మెరుగుగా కోలుకుంటారని పరిశోధకులు చెబుతున్నారు.

వ్యాయామంతో.. స్ర్టోక్​కు చెక్​..:

బ్రెయిన్​, గుండె స్ర్టోక్​, మధుమేహం, ఊబకాయం తదితర వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి.  జీవన శైలిలో భాగంగా ప్రతి రోజు వ్యాయామం చేయడం వల్ల రక్తసరఫరాలో  ఏ సమస్య రాదు. మెదడుకు కూడా అందాల్సిన ఆక్సిజన్​ సక్రమంగా అందుతుంది. మద్యపానం, దూమపానం కు దూరంగా ఉండాలి. ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటిస్తే వ్యాధులు దరిచేరవని స్పష్టం చేశారు న్యూరో స్పెషలిస్ట్​ డాక్టర్​ హేమంత్​ కుమార్​.

About Author