PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పంచాయతీ కార్యదర్శుల సమీక్షా సమావేశం

1 min read

మాట్లాడుతున్న డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్

సమావేశానికి హాజరైన పంచాయతీ కార్యదర్సులు, విస్తరణ అధికారులు

ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. డీపీఓ

ప్రత్యేక పారిశుధ్య నిర్వాహణకు 450 మంది కార్మికులు

మున్సిపాలిటీతో పాటు 14 గ్రామ పంచాయతీలలో పారిశుధ్య కార్యక్రమాలకు ప్రణాళికలు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. స్థానిక నూజివీడు మండల ప్రజా పరిషద్ కార్యాలయంలో శనివారం విస్తరణ అధికారులు, పంచాయతీ  కార్యదర్సులతో డివిజనల్ స్థాయి సమీక్షా సామావేశం డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ నిర్వహించి పలు సూచనలు చేసారు. సందర్బంగా డీపీఓ శ్రీనివాస మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 17 నవంబర్ న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనడానికి జిల్లాకు రానున్న సందర్బంగా పారిశుధ్య నిర్వహణపై పంచాయతీ కార్యదరులు, విస్తరణ అధికారులతో ముందస్తు  సమీక్షా సమావేశం నిర్వహించారు. హెలిప్యాడ్, ఎం.ఐ.జి లేఔట్, వాహనాలు పార్కింగ్ ప్రాంతాలలో ముఖ్యంగా హెలిప్యాడ్ నుంచి బహిరంగ సభ ప్రాంగణం రోడ్డు మార్గంలో ప్రత్యేక పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాలు జరగాలని సిబ్బందిని ఆదేశించారు. అంతేగాక నూజివీడు పట్టణం పరిసర ప్రాంతాలలో 14 గ్రామ పంచాయతీలను గుర్తించడం జరిగిందని ఈ ప్రాంతాలలో డ్రైనేజీ క్లీనింగ్, మలతీయన్ పిచికారీ, లోతేట్టు ప్రాంతాలు శుభ్రం చేయడం, త్రాగునీరు ట్యాంకులు క్లీనింగ్, ఫాగ్గింగ్ యంత్రాలతో దోమల నివారణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించడానికి 450 మంది కార్మికుల సేవలను, 200 మంది పంచాయతీ కార్మికులను వినియోగించునున్నామని విస్తరణ అధికారుల ఆధ్వర్యంలో జరుగు పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాలను డివిజనల్ పంచాయతీ అధికారులు పర్యవేక్షణ చేయనున్నారని, విది నిర్వహణలో సిబ్బంది అలసత్వం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని సమావేశంలో డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ హెచ్చరించారు. కార్యక్రమంలో కమీషనర్ సయ్యద్ అబ్దుల్ రషీద్, డివిజనల్ పంచాయతీ అధికారి సుందరి తదితరులు పాల్గొన్నారు.

About Author