చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై దృష్టి సారించండి
1 min readపల్లెవెలుగువెబ్, చాగలమర్రి: మండలంలోని వివిధ గ్రామాలలో చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిసారించాలని ఆళ్లగడ్డ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి మహిళా సంరక్షణ కార్యదర్శులు, మహిళా మిత్రలను కోరారు. బుధవారం స్థానిక పీఎస్ ఆవరణలో జిఎమ్ఎస్కె, మహిళా మిత్రతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో సిఐ మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై, సమస్య తలెత్తే అవకాశాలు ఉంటే వాటిని ముందుగానే గుర్తించి సమాచారం అందజేయాలన్నారు. నాటుసారా, మట్కా, గ్యాంబ్లింగ్లకు సంబంధించి కొత్త వ్యక్తులు ఎవరైనా గ్రామాలలో సంచరిస్తుంటే తమ దృష్టికి తీసుకు రావాలన్నారు. అలాగే మహిళలకు దిశ యాప్ గురించి అవగాహన కల్పించాలన్నారు. గ్రామాలలో మహిళల సమస్యలను గుర్తించి వాటి పరిష్కరించేందుకు అందరం కృషి చేద్దామన్నారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబులు బలరాముడు, శ్రీనివాసులు, జిఎమ్ఎస్కెలు, మహిళా మిత్రలు పాల్గొన్నారు.