ఐటీ మంత్రికి ట్విట్టర్ షాక్.. అకౌంట్ స్టాప్ !
1 min readపల్లెవెలుగు వెబ్ : కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు ట్విట్టర్ షాక్ ఇచ్చింది. ఆయన ట్విట్టర్ అకౌంట్ ను గంట సేపు నిలిపేసింది. అమెరికా డిజిటల్ మిలీనియం కాపీరైట్ చట్టం నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో ఆయన ట్విట్టర్ అకౌంట్ ను నిలిపేసినట్టు ట్విట్టర్ ప్రకటించింది. ట్విట్టర్ నూతన ఐటీ నిబంధనలు ఉల్లంఘించింద ని, అకౌంట్ నిలిపేసే ముందు తనకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. ట్విట్టర్ కు, కేంద్రానికి మధ్య కొంతకాలంగా వివాదం ఉంది. ఈ నేపథ్యంలో ఐటీ మంత్రి ట్విట్టర్ అకౌంట్ నిలిపివేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.