ప్రజా సేవకే.. అంకితం..
1 min readఓడినా.. ప్రజల్లోనే ఉన్నా….
- గెలిచినా.. దగ్గరుండి సేవ చేస్తా..
- కర్నూలు వాసులంతా నా కుటుంబ సభ్యులే..
- ఒక్క అవకాశం ఇవ్వండి.. కర్నూలును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతా..
- హై కోర్టు బెంచ్ తీసుకొస్తా…
- యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా…
- భావితరాల భవిష్యత్‌కు… భరోసా ఇస్తా..
- సొంత మేనిఫెస్టోతో.. ప్రజల్లో దూసుకెళ్తున్న టీజీ భరత్
- టీజీ భరత్ పై … ప్రజల్లో పెరుగుతున్న నమ్మకం..
- గెలిపించేందుకు సిద్ధమంటూ.. వెల్లివిరుస్తున్న సంకేతాలు..
కర్నూలు అభివృద్ధి కోసం ఎంత దూరమైనా వెళ్తా… ఎవరినైనా కలుస్తా…ఎంతైనా వెచ్చిస్తా….నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ… టీడీపీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి టీజీ భరత్ మాటలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న టీజీ భరత్… ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే… కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడంతోపాటు యువతకు ఉపాధి, హై కోర్టు బెంచ్ తీసుకొస్తానని భరోసా ఇస్తున్నారు. టీడీపీ మేనిఫెస్టోతో పాటు సొంత మేనిఫెస్టోను విడుదల చేసి…. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని ప్రజల్లో నమ్మకం కల్పించడంలో సఫలీకృతుడయ్యాడు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతున్న టీజీ భరత్‌కు వస్తున్న విశేష స్పందనే… ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.
పల్లెవెలుగు, కర్నూలు:“ వైసీపీ ఎమ్మెల్యేలా… నేను అబద్దం చెప్పను… మోసం చేయను… దోచుకోను…. ఉన్నది ఉన్నట్లు చెబుతా.. సేవ చేస్తా… నన్ను నమ్మి ఒక్క అవకాశం ఇవ్వండి ’’ అని … వేడుకుంటున్న టీజీ భరత్‌కు ఈ సారి ఎన్నికల్లో గెలుపు తథ్యమంటూ ప్రజా సర్వేలు చెబుతున్నాయి. రాజకీయ కుటుంబానికి చెందిన టీజీ భరత్ మాట ఇస్తే… చేస్తాడన్న నమ్మకం ప్రజల్లో మెండుగా ఉంది. గత ఎన్నికల్లో అతి స్వల్పమెజార్టీతో ఓడిన టీజీ భరత్… ఈ సారి అధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత కర్నూలు ప్రజలే తీసుకుంటారనే చర్చ ప్రధానాంశంగా మారింది.
కర్నూలు అభివృద్ధి.. నా బాధ్యత…:
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలోని అన్ని పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. కానీ.. ప్రజలే దేవుళ్లుగా భావించే టీజీ భరత్ కు.. ‘టెన్షన్’ అనే పదం దరిచేరలేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీజీవీ కుటుంబం ప్రజలకు చేసిన సేవలు… మరే ఇతర రాజకీయ నాయకుడు చేయలేడనే చెప్పవచ్చు. గత ఎన్నికల్లో ఫ్యాన్ హవా… రాష్ట్రమంతా ఉన్నప్పుడే అతి తక్కువ ఓట్లతో టీజీ భరత్ పరాజయం పాలయ్యాడు. “ ఓడినా ప్రజల్లో ఉన్నా… గెలిస్తే .. దగ్గరుండి సేవ చేస్తా… ఒక్క అవకాశం ఇవ్వండి.. అంటూ టీడీపీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి టీజీ భరత్ విజ్ఞప్తికి విశేష స్పందన వస్తోంది. ‘ కర్నూలు అభివృద్ధి నా బాధ్యత… నన్ను గెలిపించే బాధ్యత మీదే…’ అని చెబుతున్న టీజీ భరత్‌కు… అదే స్థాయిలో గెలిపించేందుకు మేం సిద్ధం అంటూ ప్రజల నుంచి సంకేతాలు వెల్లివిరుస్తున్నాయి.
టీజీ భరత్ మేనిఫెస్టో… అదుర్స్…:
రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు అభివృద్ధి కోసం ఎంత దూరమైనా వెళ్తా… ఎవరినైనా కలుస్తా… ఎంతైనా ఖర్చు చేస్తా… అంటూ భరోసా కల్పిస్తున్న టీజీ భరత్‌కు జనాలు నీరాజనం పలుకుతున్నారు. పార్టీ మేనిఫెస్టోతోపాటు తన సొంత మేనిఫెస్టోకు ప్రజలు ఆకర్షితులవున్నారు. కర్నూలు స్మార్ట్ సిటీగా తీర్చిదిద్ది.. రాష్ట్రంలోనే గొప్ప నగరంలో రూపొందిస్తానని హామీ ఇచ్చారు. కర్నూలు నియోజకవర్గ అభివృద్ధి నా బాధ్యత… నన్ను గెలిపించే బాధ్యత మీదే అని చెప్పడంతో ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది.
హై కోర్టు బెంచ్.. తీసుకొస్తా…:
కర్నూలు న్యాయ రాజధాని అంటూ… ఊకదంపుడు మాటలు చెప్పే.. వైసీపీ నాయకుల మాటలు నమ్మి.. మరోసారి మోసపోవద్దని టీజీ భరత్ ప్రజలను వేడుకుంటున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన ఆయన… కర్నూలుకు హై కోర్టు బెంచ్ తీసుకురావడం తన బాధ్యత అని చెప్పుకొస్తున్నారు.
పరిశ్రమలు..ఉపాధి…:
తనను గెలిపిస్తే… కర్నూలు నియోజకవర్గంలో కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి.. యువతకు ఉపాధి కల్పిస్తానని టీజీ భరత్ భరోసా కల్పిస్తున్నాడు. ప్రముఖ కంపెనీలతో ఆరు నెలలకోసారి జాబ్ మేళా ఏర్పాటు చేసి… ఉపాధి మెరుగు పడేలా చేస్తానన్నారు. స్టార్టప్ కంపెనీ ఆరంభించి.. యువతను ప్రోత్సహిస్తామని చెప్పడంలో సక్సెస్ అయిన టీజీ భరత్ కు యువత నుంచి మంచి స్పందన వస్తోంది.
మహిళలకు భద్రత… ఆర్థిక భరోసా…:
కర్నూలు నియోజకవర్గ పరిధిలోని ప్రతి అమ్మ, అక్కా చెల్లెమ్మల భత్రతతోపాటు.. వారికి ఆదాయం పెంచేలా ప్రణాళికలు రూపొందిస్తాం. ప్రతి విద్యార్థినీ గ్రాడ్యుయేట్ అయ్యే విధంగా చూడటంతోపాటు మహిళలకు చేయూత ఇచ్చేలా ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయిస్తాము. నా కర్నూలు ఆడ పడచులకు ఎలాంటి ఆపద వచ్చినా… మీ అన్నలా.. నేను ఉంటానని భరోసా కల్పిస్తూ… ముందుకు వెళ్తున్నాడు.
ఆరోగ్యంపై… శ్రద్ధ…:
కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిని వందశాతం మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా ఆధునీకరిస్తాము. ప్రస్తుత యునానీ ఆస్పత్రిని సొంత నిధులతో రూపురేఖలు మారుస్తా. గర్భిణీలు మరియు ప్రసూతి పిల్లల విభాగాలను మెరుగు పరిచి ఆహ్లాద వాతావరణం కల్పిస్తాము. దోమల వల్లే వ్యాప్తి చెందే మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, టైఫాడ్కు స్వస్తిపలికిలే చర్యలు తీసుకుంటా. సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక చొరవ తీసుకుంటానని హామీ ఇస్తూ.. విస్తృత ప్రచారం చేస్తున్నారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి… తనను గెలిపిస్తే… సొంత డబ్బుతో కర్నూలును అభివృద్ధిపథంలో పరుగులు పెట్టించే బాధ్యత తనదేనని హామీ ఇస్తున్నారు. ఈసారి ఆశీర్వదించాలని వేడుకుంటున్నాడు.