పొలిటికల్ జేఏసీ నుంచి వైదొలుగుతున్న కర్నూలు జిల్లా కురువ సంఘం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లాలో కురువ సంఘాల ఐక్యవేదికలో భాగంగా ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సీట్ల విషయంలో పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసిన విషయం తెలిసినదే కానీ సీట్ల కేటాయింపు పూర్తయినందున పొలిటికల్ జేఏసీ నుంచి కర్నూలు జిల్లా కురువ సంఘం వైదొలుగుతున్నట్లు జేఏసీ వైస్ చైర్మన్ తౌడు శ్రీనివాసులు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కురువ అభ్యర్థులు ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసిన స్థానాల్లో కర్నూలు జిల్లా కురువ సంఘం తరఫున తమ పూర్తి సహకారం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం .కే . రంగస్వామి,సహాయ కార్యదర్శి కోత్త పల్లి దేవేంద్ర పెద్దపాడు పుల్లన్న ,పెద్దపాడు బీచుపల్లి ,హరిదాసు ,బి .సి . తిరుపాలు తదితరులు పాల్గొన్నారు.