NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైల్వే ప్రాజెక్ట్ ల నిర్మాణాలకు సంబంధించిన భూ సేకరణను త్వరితగతిన పూర్తి చేయాలి

1 min read

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

పల్లెవెలుగువ వెబ్ కర్నూలు: రైల్వే ప్రాజెక్ట్ ల నిర్మాణాలకు సంబంధించిన భూ సేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు..శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో  రైల్వే అండర్ బ్రిడ్జి/రైల్వే ఓవర్ బ్రిడ్జి,  తదితర రైల్వే ప్రాజెక్ట్  నిర్మాణ పనుల పురోగతి పై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా  ఆదోని వద్ద నిర్మించనున్న లెవెల్ క్రాసింగ్, కౌతాళం, ఆదోని మండలాలలోని ఎరిగేరి, కుప్పగల్ గ్రామాల్లో నిర్మించనున్న లెవెల్ క్రాసింగ్,  పెద్దకడబూరు మండలంలోని గవిగట్టు గ్రామంలో నిర్మించనున్న లెవెల్ క్రాసింగ్,  కకోసిగి మండలం ఇరంగల్ గ్రామం వద్ద  లెవెల్ క్రాసింగ్,  ఆదోని మండలం కడితోట గ్రామం వద్ద  లెవెల్ క్రాసింగ్, హాలహర్వి మండలం  సాకిబండ గ్రామం వద్ద   లెవెల్ క్రాసింగ్,  కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామం సమీపంలో  నిర్మించనున్న లెవెల్ క్రాసింగ్ ల  పురోగతిపై కలెక్టర్ అధికారులతో చర్చించారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి భూ సేకరణ,ఇతర ప్రక్రియలను  త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు… ఆదోని డివిజన్ కి సంబంధించి పెండింగ్ లో ఉన్న లెవెల్ క్రాసింగ్ గేట్స్ ప్రాజెక్ట్స్ 201, 207 లను మే నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. బి.నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి,  డిఆర్ఓ సి.వెంకటనారాయణమ్మ, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, ఆర్అండ్ బి ఎస్ఈ మహేశ్వర రెడ్డి, రైల్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author