దేశంలోనే అత్యధిక నిధులను మైనార్టీ సంక్షేమానికి కేటాయించిన రాష్ట్రం ఏపీ
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను, మైనార్టీ సంక్షేమం కోసం ₹5,434 కోట్ల భారీ నిధులను కేటాయించిన కూటమి ప్రభుత్వం.చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, దేశంలోనే మొదటిసారిగా అత్యధిక నిధులను మైనార్టీ సంక్షేమానికి కేటాయించిన రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి మైనార్టీల సంక్షేమం కొరకు కట్టుబడి ఉన్నట్టు మరోసారి రుజువు చేశారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముస్లిం సమాజం తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కి మరియు ఈ విజయములో కీలక పాత్ర పోషించిన మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి NMD ఫరూక్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.- సూరి మన్సూర్ అలీఖాన్టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ.