ఆటో కార్మికులపై ప్రభుత్వ అధికారులు “నూతన వాహన చట్టాలతో చేస్తున్న దాడులు ఆపాలి
1 min read
పత్తికొండ, న్యూస్ నేడు: ఆటో వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) అనుబంధం తాలూకా సమితి ఆధ్వర్యంలో మంగళవారం ఆటో కార్మికులు స్థానిక చదువుల రామయ్యా భవన్ నుండి ర్యాలీగా బయలుదేరి నాలుగు స్తంభాల దగ్గర ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమానికి ఏఐటీయూసీ తాలూకా అధ్యక్షుడు జి. నెట్టేకంటయ్య అధ్యక్షతన జరిగినధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ కార్యదర్శి ఎన్. క్రిష్ణయ్య, ఏఐటీయూసీ తాలూకా కార్యదర్శి ఎం.రంగన్నలు పాల్గొని వారు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 894 గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి నూతన చట్టాలు జీవో నెంబర్ 21&31పేరుతో భారీ జరిమానాలు విధిస్తూ ఆటో కార్మికులను వేధిస్తున్నారన్నారు.తక్షణమే అధికారులు ఆటోలపై చేస్తున్న దాడులను ఆపి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఆటో రంగాన్ని కాపాడాలని కోరారు.ఆటో డ్రైవర్స్ & మోటారు కార్మికులకు ప్రభుత్వం వాహన మిత్ర వెంటనే ఇవ్వాలని, అలాగే జి.ఓ.నెం.21&31 రద్దు చేయాలన్నారు. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం హామీని ప్రభుత్వం పునరాలచించాలని సూచించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్స్ &మోటారు కార్మికులకు వాహనమిత్ర 15 వేల రూపాయలు ఇస్తామని, భారీగా జరిమానాలు పెంచే జి.ఓ. నెం.21& 31 రద్దు చేస్తామని, డ్రైవర్లకు సంక్షేమ బోర్డు చేస్తామని, డీజిలు పెట్రోలు ధరలు తగ్గిస్తామని, టాటా మ్యాజిక్ వ్యాన్లు, జీపులు, కార్లుకు గ్రీన్ ట్యాక్స్, లేబర్ ట్యాక్స్, థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్, టోల్ గేట్ ఫీజులు తగ్గిస్తామని హామీ ఇచ్చి, చంద్రబాబు అధికారంలోకి వచ్చి 8 నెలలు దాటినా ఒక్క హామీ కూడా అమలు చేయకుండా డ్రైవర్లను నమ్మించి మోసం చేశారని దుయ్య పట్టారు.