NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రొఫెషన్ కోర్సుల్లో నైపుణ్యం సాధించి భవిష్యత్ లో స్థిరపడండి

1 min read

జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య

కర్నూలు, న్యూస్​ నేడు:  ప్రొఫెషన్ కోర్సుల్లో నైపుణ్యం సాధించి, భవిష్యత్ లో స్థిరపడాలని జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య విభిన్న ప్రతిభావంత విద్యార్థులకు సూచించారు.సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో రాష్ట్ర ప్రభుత్వం  మంజూరు చేసిన 13 ల్యాప్ టాప్ లను, 12 సెల్ ఫోన్లను జాయింట్ కలెక్టర్  విభిన్న ప్రతిభావంతులకు  అందజేశారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్, డిగ్రీ తదితర ప్రొఫెషనల్ కోర్సులు చేస్తున్న అర్హులైన   విభిన్న ప్రతిభావంతుల కొరకు 13 ల్యాప్ టాప్ లను ఇవ్వడం జరిగిందన్నారు.. అదే విధంగా ఇంటర్మీడియట్  కోర్సు పూర్తి చేసిన 12 మంది విభిన్న ప్రతిభావంతులకు సెల్ ఫోన్లను అందజేయడం జరిగిందన్నారు. ఒక్కొక్క  ల్యాప్ టాప్ దాదాపుగా 58 వేల రూపాయలు ఉంటుందన్నారు.. విద్యార్థులు ల్యాప్ టాప్ లు, మొబైల్ ఫోన్ లను వినియోగించుకుని  వారి ప్రొఫెషనల్ కోర్సుల్లో నైపుణ్యం సాధించాలని,   భవిష్యత్ లో ఉన్నత స్థానంలో స్థిరపడాలని జాయింట్ కలెక్టర్ విద్యార్థులకు సూచించారు… జాయింట్ కలెక్టర్ విద్యార్థులకు ల్యాప్ టాప్ లను అందజేస్తూ ఎక్కడ చదువుతున్నారు. ఏమి చదువుతున్నారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.. బాగా చదువుకోవాలని జాయింట్ కలెక్టర్ విద్యార్థులను కోరారు.కార్యక్రమంలో డిఆర్ఓ సి. వెంకట నారాయణమ్మ, విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు రాయిస్ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.

About Author