మంత్రాలయం నుండి నీటి సరఫరా చేయండి….
1 min read
నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్న ఆర్డబ్ల్యుఎస్ అధికారులు
కల్లుదేవకుంట సర్పంచ్ రవీంద్ర రెడ్డి అధ్వర్యంలో ఆర్ డబ్ల్యూ ఎస్ ఈఈ పద్మజ ను కలిసిన గ్రామస్తులు
మంత్రాలయం, న్యూస్ నేడు : మండల పరిధిలోని కల్లుదేవకుంట గ్రామంలో గత నెల 18 తేదీన త్రాగునీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో గ్రామస్తులు ఖాళీ బిందెలతో జాతీయ రహదారిని దిగ్బంధం చేయడం జరిగింది. విషయం తెలుసుకున్న ఆర్డబ్ల్యూఎస్ఈఈ పద్మజా కల్లుదేవకుంట గ్రామాన్ని సందర్శించారు. అనంతరం గ్రామస్తులు , అధికారులతో సమావేశం నిర్వహించారు. గత 20 రోజులు గా నీటి సరఫరా బంద్ అయిందని గ్రామస్తులు ఆమె దృష్టి తీసుకువెళ్ళాగ ఎందుకు నీటి సరఫరా బంద్ అయిందని ఆర్డబ్ల్యూఎస్ డీఈ మోహినుద్దీన్, మండల ఏఈ వెంకటరమణ అడిగి తెలుసుకున్నారు. సమాచారం ఇవ్వకుండా ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యావని పంచాయతీ సెక్రటరీ మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో సారి ఇలా నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గత 20 రోజులుగా నీటి సరఫరా బంద్ అయితే మా దృష్టికి ఎందుకు ఈ సమస్యను తీసుకురాలేదని మండిపడ్డారు.ప్రతి గ్రామానికి ఎన్ని గంటలు తాగునీరు వదులుతున్నారని ఏఈ , కాంట్రాక్టర్ లను అడిగి తెలుసుకున్నారు. పాత పైపులైన్ కావడంతో లీకేజీలు అవుతున్నాయని అందువల్ల తాగునీటి సమస్య ఏర్పడుతుందని మండల ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వెంకటరమణ, కాంట్రాక్టర్లు భీమయ్య వివరించారు.ఇలాంటివి మరోసారి పునరావృతం అయితే చర్యలు తప్పవని హెచ్చరించారు.ఒక నెల గడువు లోపల మీ గ్రామ తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. గడువు ముగియడంతో బుధవారం గ్రామ సర్పంచ్ రవీంద్ర రెడ్డి అధ్వర్యంలో సుమారు 200 మంది గ్రామస్తులు ఆదోని లో ఆర్డబ్ల్యుఎస్ ఈఈ కార్యాలయానికి వెళ్లి ఆమేతో సంప్రదింపులు జరిపారు. ఆమె ఇచ్చిన మాట ప్రకారం వేసవి కాలంలో నీటీ ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వారి కి వివరించారు. సూగురు పైపులైన్లు నుండి నీటిని సరఫరా చేస్తామని తెలిపారు. అందుకు గ్రామస్తులు మాకు సూగురు నుండి కలుషిత నీరు వస్తుందని ఇది కాకుండా మంత్రాలయం నుండి నీరు సరఫరా చేయాలని కోరారు. ఈ లైన్ అయితే నీరు పుష్కలంగా అందుతాయని ఆమే దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు స్పందించిన ఆమె ఏఈ వెంకట రమణ కు వారు కోరిన విధంగా నీటి సరఫరా చేయాలని ఆదేశించారు.
