NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కేడీసీసీబీ చేర్మన్​ గా ప్రమాణస్వీకారం చేసిన టిడిపి నేత విష్ణువర్ధన్ రెడ్డి

1 min read

కర్నూలు, న్యూస్ ​నేడు:  కర్నూల్ నగరంలో స్థానిక కేడీసీసీబీ కార్యాలయంలో ఘనంగా ప్రమాణస్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ బస్తిపాటి నాగరాజు  కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి  జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ తిక్కారెడ్డి నియోజకవర్గ పరిశీలకులు రామలింగేశ్వర రెడ్డి  డీసీఏంసీ చేర్మెన్ నాగేశ్వర యాదవ్ మరియు సీఈఓ మరియు సిబ్బంది హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి కోడుమూరు నియోజకవర్గం తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు మరియు రైతులు మరియు పాణ్యం కర్నూల్ నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా శ్రీ డి విష్ణువర్ధన్ రెడ్డి  మాట్లాడుతూ బ్యాంక్  నుండి రైతులకు వచ్చే సబ్సిడీ పై రైతులకు మరియు వ్యాపారస్తులకు అవగాహనా కల్పించి రాష్ట్రంలో 5వ స్థానములో ఉన్న బ్యాంక్ ను ఉన్నత స్థానములో నిలపెట్టడానికి బ్యాంక్ సిబ్బంది మరియు నేను కృషి చేస్తామని తెలిపారు.

About Author