పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ కర్నూలు లో మౌన దీక్ష
1 min read
చింత సురేష్ బాబు నేతృత్వంలో జనసేన నివాళి
కర్నూలు, న్యూస్ నేడు: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన అమానుష ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ఈ దుశ్చర్యలో అమరులైన అమాయక పర్యాటకులకు సంతాపం తెలిపేందుకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం, జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ శ్రీ చింతా సురేష్ బాబు ఆధ్వర్యంలో గురువారం స్థానిక గౌరీ గోపాల్ హాస్పిటల్ సమీపాన ధర్నా చౌక్ నందు నల్ల బ్యాడ్జిల్యాలతో మౌన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చింతా సురేష్ బాబు మాట్లాడుతూ మృతుల ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థిస్తు, ఉగ్రవాదంపై నిరసనగా మౌనంగా నివాళులు అర్పిస్తున్నామన్నారు. దేశంలో అశాంతిని సృష్టించాలనే ఉద్దేశంతో అమాయక పర్యాటకులపై జరిపిన ఈ దాడి మానవత్వంపై జరిగిన దాడిగా భావించాలని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ దేశాన్ని తలవంచించే శక్తుల్ని సహించబోమని అన్నారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి బోయ కార్పొరేషన్ డైరెక్టర్ తోళ్ల మంజునాథ్, జనసేన నాయకులు పవన్ కుమార్, సంధ్యా విక్రమ్ కుమార్, కటిక మహమ్మద్ షబ్బీర్, యాసపోగు బజారి, బి సుధాకర్, నవీన్ రెడ్డి, బోయ గోవిందు తదితరులు పాల్గొన్నారు.