ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకం : ఉప్పులేటి దేవి ప్రసాద్
1 min read
రాష్ట్ర ప్రభుత్వం అమలుజరుపుతున్న ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ ను నిలిపివేయాలి!
విజయవాడ, న్యూస్ నేడు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ ను అఖిలభారత మాల సంఘాల జేఏసీ వ్యతిరేకించింది. గురువారం జేఏసీ ఆధ్వర్యంలో చైర్మన్ ఉప్పులేటి దేవి ప్రసాద్ గురునానక్ కాలనీలోని తన కేంద్ర కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వర్గీకరణ ఆర్డినెన్స్ అశాస్త్రీయంగా ఉందని కేవలం రాజకీయ మైలేజ్ కోసమే చంద్రబాబునాయుడుు ఈ యొక్క వర్గీకరణను వాడుకున్నాడని, వర్గీకరణ ద్వారా ఎస్సీలు అందరు కూడా నష్టపోతున్నారని ,ముఖ్యంగా మాలలకు అన్యాయం జరిగిందని దేవి ప్రసాద్ చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ జీవితాన్ని తూర్పారబట్టారు. తాము ఎస్సీ షెడ్యూల్ కులాల వర్గీకరణకు వ్యతిరేకమన్నారు. వర్గీకరణ ఆర్డినెన్సును నిలుపుదల చేయకపోతే కోర్టుకెల్లడానికైనా వెనకాడ బోమన్నారు. వర్గీకరణ వల్ల మాదిగలకు ఎక్కువ న్యాయం మాలలకు తక్కువ న్యాయంజరుగుతుందన్నారు.ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దుచేయాలని, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగాలలో పర్మినెంటుగా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అఖిలభారత మాల సంఘాల జేఏసీ వైస్ చైర్మన్ గుర్రం రామారావు, మాజీ డిఎస్పి రవికుమార్, గుంటూరు నగర అధ్యక్షులు నల్లపు నీలాంబరం, బోరగా రత్నం, విప్పర్ల విజయభాస్కర్, కనకవల్లి వినయ్ కుమార్, డాక్టర్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.