ఎమ్ బి బి ఎస్ లను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టేందుకు ఐ ఎస్ ఎమ్ వేదిక!
1 min read
విజయవాడ , న్యూస్ నేడు : డాక్టర్ల కెరీర్ ను బలపరచి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టే విధంగా ముందుకు తీసుకెళ్లడానికి ఐ ఎస్ ఎమ్ వేదికగా దోహదపడుతుందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మునుజేటి రామారావు స్పష్టంచేశారు. గురువారం, మొఘల్ రాజ్ పురంలోని అమ్మా కళ్యాణమండపం సమీపంలో నూతన ఇంటర్నేషనల్ హయ్యర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ (ఐ ఎస్ ఎమ్) నూతన బ్రాంచ్ ని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూరెండు తెలుగు రాష్ట్రాల లో 10 వరకు కార్యాలయాలు అందుబాటులో ఉన్నాయన్నారు.విదేశాలలో ఎమ్ బి బి ఎస్ కోసం ఇంటర్నేషనల్ హయ్యర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కాలేజ్ లో చేరి వారి కలలను సాకారం చేసుకోవాలన్నారు. మెడిసిన్ చేయడానికి, ఎఫ్ ఎం జి ఎగ్జామ్ సులభతరం చేయటానికి ఐ ఎస్ ఎమ్ ఫోకల్ పాయింట్ ఎంతో దోహదపడుతుందన్నారు.ఇంటర్నేషనల్ హయ్యర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కాలేజ్ అనేది నేషనల్ మెడికల్ కమిషన్ ( ఎన్ఎంసి) గుర్తింపు పొందిన సంస్థగా పేర్కొన్నారు.కార్యక్రమంలో నూతన బ్రాంచ్ మేనేజర్లు పవన్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
