ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ ఎమ్మెల్యే
1 min read
న్యూస్ నేడు ఆలూరు: గురువారం, ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలంలోని,కల్లపరి గ్రామంలో గ్రామ ప్రజలు పిల్లలు విషజ్వరాలతో అల్లాడుతున్న, పట్టించుకోని అధికారులు, ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే శ్రీ_బుసినే_విరుపాక్షి_ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడి సంవత్సరమవుతున్న గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులపై వైద్యాధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదని అధికారులపై, కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. వైయస్సార్సీపి ప్రభుత్వంలో ప్రతి గ్రామాలలో వైయస్సార్ విలేజ్ క్లీనింగ్,ఏర్పాటు చేసి వైద్యాధికారులను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వము వచ్చాక ఆరోగ్యశ్రీ పథకం ఎత్తివేసిందని తెలిపారు.ఆస్పరి మండలంలో త్రాగునీరు సమస్య అధికంగా ఉందని పలుమార్లు,అధికారులకు,నాయకులకు తెలియజేశానని అయినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. గ్రామంలో నెలకొన్న ఆపరిశుభ్రత,కలుషితనీటి వల్లే విష జ్వరాలతో గ్రామస్తులంతా బాధపడుతున్నారని, గ్రామంలో వ్యాధుల నివారణకు ప్రత్యేకంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని వైద్యాధికారులకు కోరుతున్నారు.