సంచార చికిత్స కార్యక్రమం ఆకస్మికంగా తనిఖీ
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: గురువారంఉదయం ఉల్లిందకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని కె. పి. తాండ గ్రామంలో సంచార చికిత్స కార్యక్రమాన్ని జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్. రఘు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ మలేరియా జ్వరం ఆడ అనాఫీలస్ దోమకాటు ద్వారా వ్యాపిస్తుంది,ఇది మంచి నీటిలో పెరిగి మలేరియా వ్యాధిని వ్యాపింపజేస్తుంది. ఇందులో రెండు రకాలుంటాయి, మొదటిది వైవాక్స్ మలేరియా,రెండోది పాల్సిఫారమ్ ఇది అత్యంత ప్రమాదకరం,దీని బారిన పడినవారు చలిజ్వరము,తలనొప్పి,ఒళ్ళునొప్పులు,తీవ్రంగా వణకడము, కండరాల బలహీనత, ఛాతిలో నొప్పిగా ఉండడము,దగ్గు,చెమటలు పట్టడము,వాంతులు విరేచనాలు,నీరసంగా ఉండడము,ఆయాసం లాంటివి రావడము లాంటి లక్షణాలతో బాధపడుతారని,గర్భినీల్లో,చిన్న పిల్లలు ఈ వ్యాధి తీవ్రతకు ఎక్కువగా గురవుతారు అని తెలిపారు.ఇంటి పరిసరాలలో నీరు నిలువ ఉండకుండా చూసువాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని,దోమతెరలువాడుకొనుటద్వారా మలేరియా,డేంగి,చికున్ గున్యా, మెదడువాపు,బోదకాలు, జీకా వైరస్ తదితర వ్యాధుల బారిన పడకుండా రక్షణ పొందవచ్చునని తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్. కృష్ణ బాయ్,ఆరోగ్య విద్యాభోదకురాలు గౌరీ, ఆరోగ్య కార్యకర్త ప్రశాంతి, ఆశా కార్యకర్తలు మరియు ప్రాజెక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.