రైల్వే సమస్యల పై జీ.ఎం కి వినతిపత్రం అందజేసిన ఎం.పి
1 min read
జిల్లాలోని రైల్వేశాఖ కు సంబంధించిన పలు అంశాల పై దక్షిణ మధ్య రైల్వే జీ.ఎం అరుణ్ కుమార్ జైన్ తో చర్చించిన ఎం.పి నాగరాజు
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు మండలంలోని పంచలింగాల గ్రామం వద్ద నిర్మిస్తున్న రైల్వే కోచ్ ప్యాక్టరీ పరిశీలనకు వచ్చిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ను ఎం.పి బస్తిపాటి నగరాజు కలిశారు.. ఈ సందర్భంగా జిల్లాలోని రైల్వే శాఖకు సంబంధించిన పలు అంశాల పై జీ.ఎం తో చర్చించిన ఆయన సమస్యల పై వినతిపత్రాన్ని అందజేశారు.. ఈ సందర్భంగా ఎం.పి మాట్లాడుతూ రైల్వే కోచ్ ప్యాక్టరీని త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవడంతో పాటు కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు అధిక ప్రాధాన్యత కలిపించాలని, అలాగే మహబూబ్ నగర్ నుంచి డోన్ వరకు నిర్మిస్తున్న డబ్లింగ్ పనులను త్వరగా పూర్తి చేయడంతో పాటు కర్నూలు నుంచి వైజాగ్ కు ప్రత్యేక రైలును ఏర్పాటు చేయలాని జీ.ఎం అరుణ్ కుమార్ జైన్ ను కోరానని.. దీని పై ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.