గొలుసుల పంజా మొహరం వేడుకల్లో పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే
1 min readనూతన సంవత్సరంలో అందరూ ఆరోగ్యంగా, అన్యోన్యంగా, సంతోషంగా ఉండాలి
ఈనెల 8వ తారీఖు నుండి 17వ తారీకు వరకు కార్యక్రమాలు
ప్రతి ఏటా మొహరం వేడుకలు వంశ పార్యంపర్య ముజావర్లు నిర్వహించడం అభినందనీయం
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : స్థానిక పెద్ద పోస్ట్ ఆఫీస్ ఏలూరు మెయిన్ బజార్ గొలుసులు పంజా హజారత్ మౌల అలీ అహంతుల్లా వారి ఆస్థాన ఆధ్వర్యంలో మొహరం (నూతన సంవత్సర వేడుకలు) ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ పండుగ కార్యక్రమానికి కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు విచ్చేసిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మొదటి రోజు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ అన్ని మతాల సారాంశం ఒక్కటేనని ప్రతి ఒక్కరూ ఒకరినొకరు కలిసిమెలిసి సహాయ సహకారాలు అందించుకోవాలన్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఒకే కుటుంబంల కలిసిమెలిసి అన్యోన్యంగా జీవించాలన్నారు. ఈ సంవత్సర కాలమంతా అందరూ ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలన్నారు. గత సంవత్సరం కూడా ఈ వేడుకలలో పాల్గొన్నానని, ఎమ్మెల్యేగా పదవి స్వీకరించిన తరుణంలో మరోసారి ఈ వేడుకలకు పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. మైనార్టీల సంక్షేమ సంఘానికి అవసరమైన అన్ని విషయాలను తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా సహాయ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వంశ పారంపర్య ముజా వర్లు ఎండి వజీర్ అలీ,గాలిబ్ ఆలీ, మౌల అలీ, ఖాదర్ అలీ, నాసర్ ఆలీ, మున్సర్ ఆలీ, షాహిద్ ఆలీ, కాజా ఆలీ మరియు రాష్ట్ర దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి షేక్ సయ్యద్ బాజీ, కమిటీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.