వట్లూరు డా.బి.ఆర్. అంబేద్కర్ గురుకులంలో విద్యార్థులు ప్రతిభ
1 min read
విద్యార్థులను,అధ్యాపకులను అభినందించిన ప్రిన్సిపల్
డి.మేరీ ఝాన్సీ రాణి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : పదవ తరగతి ఫలితాల్లో డా.బి.ఆర్. అంబేద్కర్ గురుకులం, వట్లూరు విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. పశ్చిమ గోదావరి,ఏలూరు జిల్లా లలో ఉన్నటువంటి డా:బి.ఆర్. అంబేద్కర్ గురుకులాల్లో 97% ఉత్తీర్ణతతో మొదటి స్థానం మరియు పెదపాడు మండలంలో గల అన్ని పాఠశాలల్లో మొదటి స్థానంలో నిలిచారు. టి.మహాలక్ష్మి 563 మార్కులతో పెదపాడు మండలంలో రెండవ స్థానం సాధించగా,కె.శృతి 558 మార్కులతో మండలంలో మూడవ స్థానం,జి.సుష్మ 556 మార్కులతో పాఠశాల లో మూడవ స్థానం సాధించారు. ఈ ఫలితాల్లో 15 మంది విద్యార్థులు 500 కు పైగా మార్కులు సాధించగా, తెలుగులో ముగ్గురు విద్యార్థులు 100/100, సైన్స్ లో ఒక విద్యార్థి 100/100 సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ దాసరి మేరీ ఝాన్సీ రాణి ఒక ప్రకటనలో తెలిపారు.ఇంతటి ఘన విజయాన్ని అందించిన విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు.