NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నూతన అమరావతిలో వన్ స్టాప్ వ్యాపారాలు ప్రారంభించడం శుభాపరిణామం

1 min read

పద్మశ్రీ. పద్మ భూషణ్ అవార్డు గ్రహీత మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్

విజయవాడ, న్యూస్​ నేడు:  విజయవాడలో గృహ నిర్మాణానికి సంబంధించి  వన్ స్టాప్ వ్యాపారాలు ప్రారంభించడం శుభదాయకమని పద్మశ్రీ. పద్మ భూషణ్ అవార్డు గ్రహీత మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. శనివారం నాడు సనత్ నగర్ లో డ్రీమ్ నెస్ట్   ఇంటీరియర్ షోరూమ్ ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన తర్వాత నిర్మాణం రంగం ఊపొందుకుందని తెలిపారు. ప్రతి ఒక్కరు సొంత గృహాన్ని నిర్మించుకోవాలని కలలు కంటారని. ఇల్లును స్వర్గంగా తీర్చిదిద్దాలని భావిస్తారని దానికి అనువైన వస్తు సామగ్రి అంతా ఒక ప్రాంతంలో లభించే లాగా ఏర్పాటు చేయటం అభినందనీయం ఉన్నారు. అంతేకాకుండా ఏమైనా నిర్మాణం తర్వాత ఇబ్బందులు ఉంటే దాని పరిష్కారాన్ని కూడా కస్టమర్ కేర్ అందుబాటులో ఉండటం వినియోదారులు ఇబ్బందులు లేకుండా వ్యవహరించడం బాగుందన్నారు. మరో ముఖ్యఅతిథి మాజీ ఎమ్మెల్యే  యలమంచిలి రవి. మాట్లాడుతూ. ఎంతో ఖర్చుతో కూడిన ఇంటీరియర్ గృహ నిర్మాణానికి సంబంధించి ఒకచోట అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయడం బాగుందన్నారు. ఎంతో ఖర్చుతో కూడిన ఇంటి నిర్మాణానికి సంబంధించి మధ్యతరగతి కూడా అందుబాటు ధరలలో వస్తువులను గృహ నిర్మాణ పరికరాలను అందుబాటులో తేవాల్సిన అవసరం ఉందన్నారు.. మారుతున్న జీవనానికి అనుగుణంగా ప్రపంచ స్థాయి ఉత్పత్తులను తొలిసారిగా తెలుగు రాష్ట్రాలలో విజయవాడలో డ్రీమ్ నెస్ట్ ద్వారా అందిస్తున్నామని నిర్వాహకులు మేడసాని జ్యోతి. షేక్ ఖాదర్ మీరా.లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో  సినీ నిర్మాత. బలగా ప్రకాష్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రాజీవ్ రతన్. నగరానికి చెందిన ప్రముఖులు బి కార్తీక్ . గద్దె కళ్యాణ్ రామ్ మరియు వివిధ పార్టీలు చెందిన ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *