బియ్యం వేయడం లేదని తహసిల్దార్ కి ఫిర్యాదు..
1 min read
జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తాం
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : మా కాలనీలో ఈనెలలో ప్రభుత్వం నుండి వచ్చిన రేషన్ షాపులో బియ్యం,కందిపప్పు,చక్కెర జొన్నలు వేయడం లేదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నంద్యాల జిల్లా మిడుతూరు మండల తహసిల్దార్ శ్రీనివాసులుకు శనివారం మధ్యాహ్నం ఫిర్యాదు చేశారు.మిడుతూరు మండల పరిధిలోని దేవనూరు గ్రామంలో 9వ రేషన్ షాప్ డీలర్ బోయ నాయుడు బీసీ కాలనీ ప్రజలకు ఈ నెలలో ప్రభుత్వం నుండి వచ్చిన బియ్యం తదితర వస్తువులను పంపిణీ చేయలేదని గ్రామానికి చెందిన దేవన్న,నవాజ్ అలీ తదితరులు 35 మంది కాలనీ ప్రజల సంతకాలతో తహసిల్దార్ కు వారు ఫిర్యాదు చేశారు.ప్రభుత్వం నుండి రేషన్ షాపుల ద్వారా వస్తువులను ప్రజలకు సరిగ్గా అందుతున్నాయా లేదా అని అధికారులు చూడాల్సిన బాధ్యత లేదా అంటూ అంతే కాకుండా మీకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వారు తహసీల్దార్ తో అన్నారు.ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తున్నట్లు కాలనీవాసులు తెలిపారు. స్టాక్ తక్కువగా వచ్చిందని డీలర్ అంటున్నారని గ్రామంలో ఇద్దరు డీలర్లు ఉంటే ఒకరికి తక్కువగా మరొకరికి ఎక్కువగా ఏ విధంగా వస్తాయని వారు తహసిల్దార్ తో అన్నారు.నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డీలర్ పై తగిన చర్యలు తీసుకోవాలని వారు తహశీల్ధారును కోరారు.