ఉగ్రదాడిని నిరసిస్తూ కొవ్వొత్తులతో ర్యాలీ
1 min read
కౌతాళం , న్యూస్ నేడు: కౌతాళం మండలంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఆనంద్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ఆదివారం నిరసన శాంతియుతంగా కార్యక్రమం చేపట్టారు. హిందూ బంధువులందరూ ఇటీవల జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహాల్గం లో జరిగినటువంటి ఉగ్రదాడిని నిరసిస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తూ నిర్వాహకులు దాడిని తీవ్రంగా ఖండించారు. అలాగే దేశంలో ఉన్న హిందూ ముస్లింలు ఐక్యంగా ఉండాలని దేశము పాకిస్తాన్ చేసే కవ్వింపు చర్యలకు బెదరకోకుండా అలాగే ఐక్యతను వీడనాడకుండా భవిష్యత్తులో మనమంతా ఐక్యంగా ఉంటూ ఇరుగుపొరుగు దేశానికి బుద్ధి చెప్పాలని అలాగే భారతదేశం తీసుకునే అన్ని చర్యలకు మద్దతు ఇస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే ఉగ్రవాదుల్ని ఏ రూపంలో ఉన్న దాన్ని తుదమొట్టించాలని కూకటి వేళ్ళతో పేకిలించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల జనసేనా నాయకుడు రాంబాబు, హల్వి తాయన్న, ఎమ్మార్పీఎస్ నాయకులు సీనియర్ నాయకులు కాత్రికి ప్రకాష్,గుడికంబాలి మారెప్ప, బాపూర్ దవిద్,ముకప్ప,అనుమయ్య తదితరులు పాల్గొన్నారు.