ప్రజలు నీటిని వృద్ద చేయకుండా పొదుపుగా వాడుకోవాలి
1 min read
హొళగుంద న్యూస్ నేడు: మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చలువాది రంగమ్మ అధ్యక్షతన కార్యదర్శి రాజశేఖర్ మరియు సర్పంచ్ తనయుడు పంపాపతి స్థానిక మండల విద్యాధికారి కార్యాలయం వెనుక ఉన్న ఫిల్టర్ బెడ్ ను పరిశుభ్రం చేయించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిల్టర్ బెడ్ నందు పాచి,పిచ్చి మొక్కలు పెరగడంతో వెంటనే ఫిల్టర్ బెడ్ లో పెరిగిన పాచి,పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రపరచడం జరిగిందన్నారు.అలాగే వేసవి కాలం నేపథ్యంలో ప్రజలు నీటిని వృద్ద చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు.అంతేకాకుండా ఏవైనా త్రాగునీటి పరమైన సమస్యలు ఉంటే సర్పంచ్ లేదా కార్యదర్శి కి ఫోన్ ద్వారా సమాచారం అందిస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.