ఎస్సీ బాలుర వసతి గృహంను పునఃప్రారంభించాలి… ఎస్ఎఫ్ఐ
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : హోళగుందమండల కేంద్రలో ప్రభుత్వ భవనంలో ఎస్ సి బాలుర వసతి గృహాన్ని టిడిపి ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది.కానీ తరువాత వచ్చిన వైస్సార్ ప్రభుత్వం విద్యార్థులు తక్కువ ఉన్నారనే భావనతో మూసివేయదంజరిగింది అని మండల తహశీల్దార్ కి వినతిపత్రం ఎస్ఎఫ్ఐ,సీఐటీయూ నాయకులు మల్లికార్జున,నాగరాజు అందజేశారు.వారు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు మరల హాస్టల్ ను పునఃప్రారంభం చేయాలని కోరుతున్నారు అని తెలిపారు. అదేవిధంగా అసలే కరువు ప్రాంతం రైతులు ఎక్కువగా వలసలు వెళ్తుంటారు అలాంటి సమయంలో విద్యార్థులని హాస్టల్ లో వదిలి వెళ్తారు కానీ హాస్టల్ మూసి వేయడంతో విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారు.మండలంలో ఉన్న ఒక్క బీసీ బాలుర వసతి గృహంలో కూడా ఉండాల్సిన సంఖ్య కన్నా ఎక్కువే ఉన్నారు. అక్కడ చేరడానికి కూడా లేదు ఆ హాస్టల్ ఉన్న కూడా ఇక్కడ ఉన్న ఈ SC హాస్టల్ ను ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించి అడ్మిషన్లు కూడా చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో తహసీల్దార్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.