బాలికను అత్యాచారం చేసిన నిందుతులను కఠినంగా శిక్షించాలి
1 min readదిశ,నిర్భయ చట్టాలు ఎక్కడ…..
పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి మహేంద్ర బాబు డిమాండ్…
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులో నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ ముచ్చుమర్రి గ్రామంలో 8 ఏళ్ల బాలికను అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి మహేంద్ర బాబు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఎమ్మిగనూరు పట్టణం లో బాలికల పాఠశాల నుండి ర్యాలీ నిర్వహించి సోమప్ప సర్కిల్ నందు పెద్ద ఎత్తున ఆందోళన చేసి ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి మహేంద్ర బాబు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు నిర్భయ, దిశా చట్టాలు తీసుకొచ్చిన దేశవ్యాప్తంగా చిన్నారుల, మహిళలు పైన అత్యాచారాలు,హత్యలు నిత్యం జరుగుతూనే ఉన్నాయన్నారు. అదేవిధంగా ప్రభుత్వాలు చట్టాలు ఎన్ని తెచ్చిన ఎన్నో నేరాలు,ఘోరాలు,హత్యాచారాలు చేస్తున్నటువంటి నిందితులను కఠినంగా శిక్షించడం లో పూర్తిగా విఫలం చెందారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం బాలిక కుటుంబానికి 25 లక్షలు ఎక్స్ గ్రేసీయా మరియు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో పి.డి.ఎస్.యు జిల్లా ఉపాధ్యక్షులు రామకృష్ణ నాయుడు, నాయకులు జావిధ్ ,రాజు, కృష్ణ, ఇంద్ర, శ్రీకాంత్ తదితర విద్యార్థినిలు పాల్గొన్నారు.