తక్కువ ధరలకే కందిపప్పు.. బియ్యం పంపిణీకి శ్రీకారం
1 min readజాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లాలో సరసమైన ధరలలో నాణ్యమైన కందిపప్పు, బియ్యాన్ని ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఈరోజు నుండి విక్రయించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య పేర్కొన్నారు.గురువారం స్థానిక సి క్యాంప్ సెంటర్ నందు గల రైతు బజార్ లో సరసమైన ధరలలో నాణ్యమైన సరుకుల ప్రత్యేక కౌంటర్ ను జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య ప్రారంభించారు.జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశానుసారం జిల్లాలోని
1, రైతు బజార్, సి క్యాంప్ సెంటర్,2, రైతు బజార్, వెంకటరమణ కాలనీ,3, రైతు బజార్, ఆదోని,4, మండి మార్కెట్, కర్నూల్ అర్బన్,5, మోర్ మార్కెట్, కర్నూలు,6, డి మార్ట్, కర్నూలు,7, స్పెన్సర్స్ కర్నూలు,8, జ్యోతి మాల్, కర్నూలు,9, రిలయన్స్, కర్నూలు,మొత్తము 9 సెంటర్లలో ఈరోజు నుండి విక్రయాలను ప్రారంభించడం జరిగిందని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కౌంటర్ల ద్వారా కొనుగోలు చేసే వినియోగదారులు ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు కూడా తీసుకొని రావాలని, ఒక్కొక్కరికి కేజీ కందిపప్పు, ఐదు కేజీల బియ్యం, ఇస్తారని జాయింట్ కలెక్టర్ తెలియజేశారు. ప్రస్తుతం మార్కెట్ లో 181 రూపాయల కందిపప్పును160 రూపాయలకు,55.85 రూపాయల (స్టీమ్డ్ బిపిటి సోనామసూర్ బియ్యం)ను 49 రూపాయలకు , 52.40 రూపాయల( పచ్చి బిపిటి సోనామసూర్ బియ్యం)ను 48 రూపాయలకు విక్రయించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమునకు సహకరించిన మిల్లర్లకు,మండిబజార్ వర్తకులకు సూపర్ బజార్ల వారికి ప్రభుత్వం తరఫున జాయింట్ కలెక్టర్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కర్నూలు ఆర్డీవో శేషిరెడ్డి, డి ఎస్ఓ కెవిఎస్ఎం ప్రసాద్, మార్కెటింగ్ ఎడి నారాయణమూర్తి,కల్లూరు తహసిల్దార్ మునివేలు, ఏఎస్ఓ రామాంజనేయులు, ఎస్టేట్ అధికారి హరీష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.