అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి
1 min read
ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
ఎమ్మెల్యే కి పూర్ణకుంభంతో అర్చకులు ఘన స్వాగతం
పెద్ద ఎత్తున పాల్గొన్న బాక్సులు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు దక్షిణపు వీధిలోని జరాపహరేశ్వర స్వామి కాలనీలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ లక్ష్మీ గణపతి, దుర్గామల్లేశ్వర సహిత శ్రీ వేంకటేశ్వర స్వామివార్ల దివ్యలీలా విగ్రహ ప్రతిష్టా మహోత్సవాన్ని బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ప్రతిష్టోత్సవంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి,నగర మేయర్ షేక్ నూర్జహాన్, కో – ఆప్షన్ సభ్యులు ఎస్సెమ్మార్ పెదబాబు దంపతులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. నగరంలోని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకొన్నారు. తొలుత వారికి పూర్ణకుంభంతో అర్చకులు ఘన స్వాగతం పలికారు. వేద ఆశీర్వచనాన్ని అందించారు. అనంతరం విగ్రహాల ప్రతిష్టాను గావించి, హోమక్రతువులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలనే స్థానికుల ఎన్నోఏళ్ళ కల నేటికి సాకారమైందన్నారు. గతంలో తన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే, దివంగత బడేటి బుజ్జి ఈ ఆలయ నిర్మాణానికి మొదటి విరాళాన్ని అందించిన విషయాన్ని గుర్తుచేసిన ఆయన, తన చేతులమీదుగా విగ్రహ ప్రతిష్ట జరగడం సంతోషంగా ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. మేయర్ నూర్జహాన్ మాట్లాడుతూ లక్ష్మీ గణపతి విగ్రహాన్ని తమ సొంత నిధులతో ఇక్కడ ప్రతిష్టించడం సంతోషాన్నిచ్చిందన్నారు. కార్యక్రమంలో ఎఎంసి ఛైర్మన్ మామిళ్ళపల్లి పార్ధసారధి, కార్పొరేటర్ నాయుడు పృద్వీ శారద, సోము దంపతులు, బలిజ వెంకట అప్పారావు, సాయి కుమారి దంపతులు, ఆలయ కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
