శ్రీ శ్రీ కవిత్వం మనల్ని నడిపిస్తూనే ఉంటుంది..
1 min read
అరసం. జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సత్యనారాయణ
పత్తికొండ, న్యూస్ నేడు: శ్రీ శ్రీ కవిత్వం మనల్ని ఎల్లప్పుడూ నడిపిస్తూనే ఉంటుందని జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సత్యనారాయణ అన్నారు. బుధవారం స్థానిక శాంతి టాలెంట్ స్కూల్లో అభ్యుదయ రచయితల సంఘం(అరసం) ఆధ్వర్యంలో శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ 115వ జయంతిని ఘనంగా నిర్వహించారు. మొదట శ్రీ శ్రీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అరసం జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, అభ్యుదయ కవిత్వమునకు, తాజ్మహల్ నిర్మాణానికి పునాది వేసిన మేస్త్రి శ్రీశ్రీ కవిత్వానికి జేజేలు పలికారు.ధనవంతులు, పేదవాళ్లు వ్యవస్థ ఉన్నంతకాలం శ్రామికులు, సోమరులు ఉన్నంతకాలం ,శ్రమదోపిడి ఉన్నంతకాలం, పీడితులు పీడకులు ఉన్నంతకాలం ,మరో ప్రపంచం నిర్మాణం అయ్యేంతవరకు ,సమ సమాజం పుట్టుకొచ్చేంత వరకు ,శ్రీశ్రీ కవిత్వం మనల్ని నిరంతరం నడిపిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. శ్రీ శ్రీ కోరుకున్న సమ సమాజ స్థాపనే లక్ష్యంగా నేటి యువత పాటుపడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి ,అభ్యుదయ రచయితల సంఘం నాయకులువెంకటేశ్వర్లు, చాంద్ భాష,హమీద్, రహంతుల్లా మరియు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.