పిఎంఇజిపి కింద మంజూరైన యూనిట్లు త్వరితగతిన గ్రౌండింగ్ చేయాలి
1 min read
సింగిల్ విండో పధకం ద్వారా 23 పరిశ్రమలకు అనుమతులు
14 పరిశ్రమలకు రూ.1.25 కోట్ల ప్రోత్సాహకాలు
ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ల స్ధాపనకు చొరవ చూపాలి
కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశం
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు :ప్రధాన మంత్రి ఉపాధికల్పనా కార్యక్రమం కింద మంజూరైన యూనిట్లు స్ధాపనపై దృష్టిపెట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. శిక్షణా కార్యక్రమాలకు సంబంధించి స్ధానిక పోర్టల్ లో కూడా వివరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. జిల్లాలో సింగిల్ విండో కింద ధరఖాస్తు చేసుకున్న 33 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో 23 మంది పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తూ సమావేశం ఆమోదం తెలిపింది. మిగిలిన 10 ధరఖాస్తులకు సంబంధించి లీగల్ అండ్ మెట్రాలజీ, ఫైర్ సర్వీసెస్, కాలుష్యనియంత్రణా మండలి అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమల అభివృద్ధి పాలసీని అనుసరించి 14 పరిశ్రమలకు 1.25 కోట్ల రూపాయలను ప్రోత్సాహకాలుగా మంజూరుకు సమావేశం ఆమోదం తెలిపింది. జిల్లాలోని గుర్తించిన 51 పరిశ్రమలను డిప్యూటీ ఇన్స్పెక్టర్ అఫ్ ఫ్యాక్టరీస్ తో కూడిన బృందం స్పెషల్ డ్రైవ్ నిర్వహించిందని వాటిలో 47 పరిశ్రమలు పనిచేస్తున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. తనిఖీ సమయంలో గుర్తించిన లోపాలను సంబంధిత పరిశ్రమల యాజమాన్యాలకు తెలియజేసి లోపాలు సవరించిన అనంతరం వాటినుంచి నివేదికలను పొందడం జరిగిందన్నారు. జిల్లాలో ఓఎన్ డిసి కార్యక్రమం కింద వివిధ యూనిట్ల స్ధాపనలో భాగంగా ప్రతి మండలంలో ఆ మండలంలో అనువైన ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లు స్ధాపనకు సంబంధించి మే 15వతేదీ నాటికి యూనిట్ల గుర్తింపు ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఇన్స్పెక్టర్ అఫ్ ఫ్యాక్టరీస్ శ్రీనివాసరావు, డిఆర్డిడిఏ పీడీ డా:ఆర్.విజయరాజు, ఎల్డిఎమ్ నీలాద్రి, కార్మిక శాఖ ఉప కమీషనర్ పి. శ్రీనివాస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ వెంకటేశ్వరరావు , నాబార్డు డిడిఎం టి. అనీల్ కాంత్, ఐటిడిఏ పివో రాములునాయక్, ఎపిఐఐసి జెడ్ఎం కె.బాబ్జి,జిల్లా వ్యవసాయశాఖ అధికారి హబీబ్ భాషా,జిల్లా వాణిజ్య మార్కెటింగ్ అధికారి వి.మహేంద్ర,జిల్లా ఫైర్ ఆఫీసర్ సిహెచ్ రత్నబాబు , జిల్లా స్కిల్ డెవలప్ మెంట్ ఆఫీసర్ ఎన్. జితేంద్ర, డిపివో కె.అనురాధ,వివిధ శాఖల అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.
