ఘనంగా బసవ జయంతి వేడుకలు
1 min read
బనవ జయంతి వేడుకలు
హొళగుంద న్యూస్ నేడు : మండలంలో బుధవారం బనవ జయంతి వేడుకలను వీరశైవ లింగాయత్, ఇతర వర్గాల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రం హొళగుందలో బసవేశ్వరస్వామి చిత్ర పటానికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆనంతరం మహిళలు, చిన్నారుల కళనలతో బసవేశ్వరస్వామి చిత్రపటాలను, ఎద్దులను గ్రామ పుర వీదుల్లో ఊరేగించారు. కర్నాటక సంప్రదాయాలను పుణికి పుచ్చుకున్న స్థానిక ప్రజలు బసవేశ్వరుడిగా కొలిచే ఎద్దులకు ప్రత్యేక అలంకరణ చేసి వీదుల్లో ఊరేగించి ప్రతి ఏటా బసవ జయంతిని ఘనంగా చేసుకోవడం ఇక్కడ ఆనవాయితిగా వస్తుంది. ఇందులో భాగంగా బుధభారం ఇళ్లల్లో ఎద్దులను ప్రత్యేక అలంకరణ, పూజలు చేసి, నైవేద్యం సమర్పించారు. అనంతరం మహిళలు కళనలు పట్టి ఊరేగింపులో పాల్గొన్నారు. ఇక్కడి ప్రజలు ఈ బసవ జయంతి వండుగను అత్యంత మంచి రోజుగా ఎంతో ప్రాధాన్యం ఇచ్చి వెళ్లి, గృహ ప్రవేశలాంటి శుభకార్యలు కూడా నిర్వహిస్తారు. అదేవిధంగ ఎల్లార్తిలో కూడ నందికోలోత్సవం మద్య బసవేశ్వరుని చిత్రపటాన్ని గ్రామ పురవీధుల్లో ఊరేగించారు.
