జాతీయ రహదారి 340 సి లో పెండింగ్ పనులు పూర్తి చేయాలి
1 min read
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ నేడు: జాతీయ రహదారి 340 సి లో పెండింగ్ ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఎన్హెచ్ 340 సి పిడి ని ఆదేశించారు.గురువారం నంద్యాల చెక్ పోస్ట్ నుండి గార్గేయపురం వరకు జరుగుతున్న ఎన్హెచ్ 340 సి నేషనల్ హైవే రోడ్డు విస్తరణ పనులను కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నంద్యాల చెక్ పోస్ట్ నుండి గార్గేయపురం వరకు జరుగుతున్న ఎన్హెచ్ 340 సి కి సంబంధించి ఎల్లమ్మ దేవాలయం, మిలిటరీ కాలనీ, గార్గేయపురం చెరువు వద్ద పనులు పెండింగ్ ఉన్నాయన్నారు..భూసేకరణ పూర్తి చేసి స్వాధీనం చేసి, నెల రోజులైనా ఎందుకు పెండింగ్ లో ఉన్నాయని కలెక్టర్ ఎన్హెచ్ అధికారులను ప్రశ్నించారు. కాంట్రాక్టర్లను పిలిపించి వారితో మాట్లాడి పనులను త్వరితగతిన పూర్తి చేయించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం ఎన్హెచ్ 340 ఆపరేషనల్ మెయింటెనెన్స్ సెంటర్ లో నిర్వహిస్తున్న సీసీ కెమెరాల నిర్వహణను కలెక్టర్ పరిశీలించారు… జాతీయ రహదారుల్లో వాహనాల కదలికలు, ప్రమాదాలు జరిగినపుడు సీసీ కెమెరాల పనితీరు తదితర విషయాలను కలెక్టర్ పరిశీలించారు.కార్యక్రమంలో ఎన్హెచ్ 340 సి పిడి పద్మజ, ఎన్హెచ్ ఆర్ అండ్ బి ఈఈ శంకర్ రెడ్డి, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, కర్నూలు మండల తహసీల్దార్ రమేష్ బాబు, నేషనల్ హై వే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సునీతా బాయి తదితరులు పాల్గొన్నారు.