హొళగుందలో వాడవాడల వేడుకగా -పెన్షన్ల పంపిణి
1 min read
హొళగుంద న్యూస్ నేడు: దేశంలో ఎక్కడ ఎన్నడూ లేని విధంగా సంక్షేమ మార్కు ప్రజా పక్షపాత సువర్ణపాలనను కొనసాగిస్తున్న గౌరవ అంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడల కూటమి ప్రభుత్వం తరుపున టిడిపి హొళగుంద మండల కన్వీనర్ టి. తిప్పయ్య ఆధ్వర్యంలో అవ్వతాతలకు, వికలాంగ సోదర సోదరిమణులకు,ఒంటరి మహిళలు, కిడ్నీ వ్యాధి బాధితులకు తదితరులకు మే 1 నాడు తెల్లవారుజాము నుండే పెన్షన్లను అందజేసారు.హొళగుంద మండల కేంద్రంలో మండల కన్వీనర్ టి. తిప్పయ్య సారథ్యంలో పెన్షన్ దారులకు సంక్షేమ శుభాకాంక్షలు తెలుపుతూ, 2025 మే నెలలో హొళగుందలోని 4వ వార్డు మరియు బడిగే ఏరియా తదితర ఏరియాలలో సంబరంగా సాగిన పెన్షన్ల పంపిణి.ఈ కార్యక్రమంలో కూటమి తోక వెంకటేష్,కూడ్లురు ఈరప్ప తదితర నాయకులు సచివాలయ సిబ్బంది పెన్షన్ దారులు ప్రజలు పాల్గొన్నారు.